తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ముఖ్యమంత్రిని చంపాలి'.. పోస్టర్‌ కలకలం.! - పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్​

పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్​కు సంబంధించి ఆ రాష్ట్రంలో అంటించిన ఓ పోస్టర్​పై తీవ్ర కలకలం రేగింది. ముఖ్యమంత్రిని చంపితే.. రూ. 10లక్షల డాలర్లు ఇస్తారని దానిపై రాసి ఉంది.

Case lodged over 'death threat' to Punjab CM
ముఖ్యమంత్రిని చంపాలి.. పోస్టర్‌ కలకలం.!

By

Published : Jan 3, 2021, 5:12 AM IST

పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ను చంపాలంటూ గుర్తు తెలియని వ్యక్తి మొహాలిలో ఓ పోస్టర్‌ను అంటించడం కలకలం రేగింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మొహలీలోని సెక్టార్ 66-67 క్రాసింగ్ సమీపంలో ఈ పోస్టర్‌ దర్శనమిచ్చినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. ముఖ్యమంత్రిని చంపితే రూ.10 లక్షల డాలర్లు ఇస్తారని ఆ పోస్టర్‌పై రాసి ఉంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన ఓ ఈమెయిల్‌ ఐడీని కూడా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోస్టర్‌ను ఎవరు అంటించారనే విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

ఇదీ చదవండి:ఇంటర్​లో ఫస్ట్​క్లాస్​ వచ్చిన బాలికలకు స్కూటీలు

ABOUT THE AUTHOR

...view details