Case Filed on Jabardasth Comedian Nava Sandeep :నువ్వే ప్రాణం.. నువ్వే జీవితం.. నిన్నే ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నీతోనే జీవితమన్నాడు.. నీవు లేనిదే బతకలేనన్నాడు.. ప్రియుడి మాటలు నమ్మి.. మనసిచ్చిన ప్రియుడే తనను మనువాడతాడనుకుని ఆ యువతి సర్వస్వం అర్పించింది. తీరా పెళ్లికి ప్రియుడు నిరాకరిస్తుండటంతో నిలువునా మోసపోయానని గుర్తించింది. చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జబర్దస్త్ కమెడియన్ (Jabardasth Comedian), గాయకుడు నవ సందీప్(Singer Nava Sandeep) ప్రేమ పేరుతో ఓ యువతి(28) జీవితంతో ఆడుకున్నాడు. 2018లో యువతితో వాట్సాప్ ఛాటింగ్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. ఈ విషయం యువతి ఇంట్లో తెలిసింది. దాంతో ప్రియురాలిని తన స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు రప్పించుకున్నాడు. షేక్‌పేటలోని ఓ హాస్టల్లో ఉంచాడు. ఆమె 4 సంవత్సరాలుగా అక్కడే ఉంటుంది.
Minor Girl Gang Rape: ప్రేమ పేరుతో లోబరచుకుని.. దళిత బాలికపై సామూహిక అత్యాచారం.. అవమాన భారంతో..!
Case Registerd on Jabardasth Artist at Madhuranagar PS :ఈ క్రమంలో నవ సందీప్ యువతిని పలుమార్లు ఓయో, హోటళ్లకు తీసుకెళ్లి తన లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. ప్రతిసారి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. యువతితో శారీరకంగా(Fulfilled All His Desires Physically) తన కోరికలన్నీ తీర్చుకున్నాడు. తీరా పెళ్లి మాటెత్తేసరికి చేతులు దులిపేసుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే.. పెళ్లి లేదు.. ఏం లేదంటూ మాట మార్చాడు. పెళ్లిచేసుకోలేను.. నువ్వంటే నాకిష్టం లేదంటూ తేల్చి చెప్పాడు. దీంతో ప్రేమికురాలు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కింది. పోలీసుల దగ్గర తన గోడును వెల్లబోసుకుంది. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రియుడు చెప్తున్నాడని వాపోయింది. ఇప్పుడు తన జీవితం అంధకారమైందని.. అటు ఇంట్లోంచి బయటికొచ్చి.. ఇటు ప్రియుడి చేతిలో మోసపోయానని.. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో గోల్కొండ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును మధురానగర్ ఠాణాకు బదిలీ చేశారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.