తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీగా ట్రాఫిక్ జామ్.. తల్లితో కలిసి నీట్ అభ్యర్థి పరుగు.. అయినా ఆలస్యంగానే.. - ట్రాఫిక్ సమస్యల వల్ల ఎగ్జామ్ మిస్

ట్రాఫిక్ జామ్​లో ఇరుక్కుని ఓ విద్యార్థిని నీట్ ప్రవేశ పరీక్ష రాయలేకపోయింది. ఈ ఘటన కేరళలో జరిగింది. ఏడాదిపాటు కష్టపడి ప్రిపేర్ అయిన ఎగ్జామ్ రాయలేకపోయానని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

Car stuck in Traffic
Car stuck in Traffic

By

Published : May 8, 2023, 10:32 PM IST

పోటీ, ప్రవేశ పరీక్షలు కోసం ఎంతో కష్టపడి చదువుతుంటారు విద్యార్థులు. రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. ఎగ్జామ్​ హాల్​కు నిమిషం ఆలస్యం అయినా పరీక్షను అనుమతించరు నిర్వహకులు. ఎగ్జామ్​కు బాగా ప్రిపేర్ అయ్యి ట్రాఫిక్ సమస్య లేదా ఇతరేత్రా కారణాలకు పరీక్ష రాయలేకపోయివారి బాధ వర్ణనాతీతం. అచ్చం అలాంటి ఘటనే కేరళకు చెందిన ఓ విద్యార్థిని ఎదుర్కొంది.

కన్నూర్​లోని కొత్తుపురంబ నిర్మలగిరికి చెందిన నయనా జార్జ్​.. నీట్​ ప్రవేశ పరీక్షకు సన్నద్ధమైంది. నీట్​ పరీక్ష రాసేందుకు సోమవారం పెరుంబ లతీఫియా ఇంగ్లీష్ మీడియం స్కూల్​కు తన తల్లిదండ్రులు జార్జ్​, రోజ్​ మేరీతో కలిసి కారులో బయలుదేరింది. పరీక్షా కేంద్రానికి మధ్యాహ్నం 12 గంటలలోపు చేరుకోవాలి. నయనా జార్జ్​ ఉదయం 9 గంటలకే తన ఇంటి నుంచి బయలుదేరింది. అయితే కన్నూర్ - పయ్యన్నూర్​లో జాతీయ రహదారిపై ఓ కంటైనర్ లారీ బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నయన్​ ఇంటి నుంచి పయ్యన్నూర్​లోని ఎగ్జామ్ సెంటర్​కు దూరం 62 కిలోమీటర్లు. ట్రాఫిక్ లేని సమయంలో 2 గంటల్లో ఎగ్జామ్ సెంటర్​కు చేరుకోవచ్చు. అయితే సోమవారం కన్నూర్​- పయ్యన్నూర్​ హైవేపై ప్రమాదం జరగడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్​ అయ్యింది.

విద్యార్థిని నయనా జార్జ్

నయన్​ తండ్రి జార్జ్ ఎజిలోడ్​ వరకు​ కారును నడిపారు. అక్కడి నుంచి నయన్ ఎగ్జామ్​ సెంటర్​ దాదాపు 5 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఎంత ఎదురుచూసినా.. ట్రాఫిక్ తగ్గేలా కనిపించలేదు. దీంతో పరీక్షను దృష్టిలో పెట్టుకొని నయనా జార్జ్, ఆమె తల్లి రోజ్ మేరీ కారు దిగి పరుగు ప్రారంభించారు. కిలోమీటర్ దూరం అలాగే పరిగెత్తారు. వీరిద్దరూ ఇలా పరిగెత్తడాన్ని చూసిన ఓ బైకర్.. వెంటనే నయనా జార్జ్​కు లిఫ్ట్ ఇచ్చాడు. బైక్​పై వేగంగా ఎగ్జామ్ సెంటర్​కు తీసుకెళ్లాడు. అయినప్పటికీ నాలుగు నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్​కు చేరుకున్నారు. దీంతో నయన్​ను ఎగ్జామ్ సెంటర్​లోకి అనుమతించలేదు. దీంతో నయన్​ ఒక్కసారి తీవ్ర భావోద్వేగానికి గురైంది. మరోవైపు.. ఎగ్జామ్ సెంటర్ బయటే నయనా తల్లి మేరీ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను నయనా తండ్రి జార్జ్​ వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

'ఏడాదిపాటు నా కుమార్తె నయనా జార్జ్​ నీట్ కోచింగ్ తీసుకుంది. ఆమె చాలా పట్టుదలతో ప్రిపేర్ అయ్యింది. నా కుమార్తెలాగే చాలా మంది విద్యార్థులు ట్రాఫిక్ సమస్యల వల్ల పరీక్షకు సకాలంలో హాజరుకాలేకపోయారు' అని నయన్ తండ్రి జార్జ్​ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నయనా సైతం కన్నీరుమున్నీరుగా విలపించింది. సంవత్సరం కాలంగా ఎంతో కష్టపడి నీట్ పరీక్ష కోసం సన్నద్ధమయ్యామని కన్నీటి పర్యంతమైంది.

ABOUT THE AUTHOR

...view details