Car Fell Into Canal In Karnataka : కర్ణాటకలోని మాండ్య జిల్లాలో కాలువలోకి కారు దూసుకెళ్లడం వల్ల ఓ బాలిక సహా నలుగురు మృతిచెందారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ జరిగింది..మలవల్లి మండలంలోని దోరనహళ్లి గ్రామానికి చెందిన మహదేవమ్మ, రేఖ, సంజన, మమతా.. తమ ఇంట్లో జరిగబోయే కార్యక్రమానికి అథితులను అహ్వానించి.. కారులో శనివారం గామనహళ్లి నుంచి బన్నూరు తిరిగి వస్తున్నారు. శ్రీరంగపట్నం మండలంలోని గామనహళ్లి గ్రామ సమీపంలోకి రాగానే రాత్రి సమయంలో అదుపుతప్పిన కారు కాలువలో పడిపోయింది. దీంతో అందులో ఉన్న బాలిక సహా ముగ్గురు మహిళలు నీట మునిగి మృతి చెందారు. డ్రైవర్ మనోజ్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇటీవల ఈ కెనాల్లోనే కారు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.