Car Fell Into Canal : ఉత్తర్‌ప్రదేశ్.. ఎటా జిల్లాలో వేగంగా దూసుకెళ్లిన ఓ కారు కాలువలో పడిపోయింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు యువతులతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గంట పాటు సహాయక చర్యలు చేపట్టి.. ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేవర్ బ్యారేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా కాస్గంజ్లోని గంజ్డూండ్వారా ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. వీరంతా ఓ యువతికి చికిత్స చేయించడానికి ఎటాకు వస్తున్నారని.. మార్గమధ్యలో కారు అదుపుతప్పి కాలువలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.
పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంతో అదుపు తప్పిన లారీ అదుపు తప్పి.. బస్‌స్టేషన్ ముందు నిలబడి ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో వీధి వ్యాపారులు కూడా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మరణించిన వారిని అభిషేక్, ఆకాశ్, అఫ్జల్‌గా గుర్తించారు. అభిషేక్, ఆకాశ్ బస్‌స్టాండ్ దగ్గర ఐస్‌క్రీమ్ వ్యాపారులు కాగా.. అఫ్జల్ తన భార్య, కుమారుడితో బస్ స్టేషన్‌లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
పెళ్లికి వెళ్తుండగా పెను ప్రమాదం.. 24 మంది మృతి..
Road Accident In Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో పెళ్లికి వెళ్తున్న ఓ మినీ ట్రక్కు ప్రమాదవశాత్తు బుహరా నదిలో బోల్తా పడింది. గత నెలలో దుర్సాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రదీప్ శర్మ సహా ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పూర్తి కథనం చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
Odisha Accident Today : ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సు, పెళ్లి బస్సు పరస్పరం ఢీకొన్నాయి. సమచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ కథనం పూర్తిగా చదవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.