తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లైఓవర్​ నుంచి కిందపడిన కారు.. 30 అడుగుల లోతు నదిలో పడిపోయిన జంట - ఉత్తరాఖండ్ నదిలో పడిన కారు న్యూస్

ఉత్తరాఖండ్​లో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ప్లైఓవర్​ పైనుంచి 30 అడుగుల లోతులో ఉన్న నదిలో పడిపోయింది. నదిలో నీరు లేకపోవడం వల్ల సురక్షితంగా బయటపడ్డారు.

Car fallls from flyover
రోడ్డు ప్రమాదానికి గురైన కారు

By

Published : Nov 25, 2022, 8:18 PM IST

ఉత్తరాఖండ్​లో ఓ ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నోయిడా నుంచి హరిద్వార్​కు ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొట్టింది. దీంతో కారులో 30 అడుగుల నదిలో పడిపోయింది. ఈ సమయంలో కారులో ఓ జంట ప్రయాణిస్తుంది. ఎండిన నదిలో పడిపోవడం వల్ల ఆ జంట.. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. నదిలో చిక్కుకున్న జంటను రక్షించారు.

ఈ ఘటనతో ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతంజలి యోగపీఠ్‌కు ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌ను దంపతులు దాటుతుండగా.. కారును బస్సు ఢీకొట్టింది. దీంతో ప్లైఓవర్​ రైలింగ్ విరిగి కారు ఎండిపోయిన నదిలో పడిపోయింది. ఈ జంటను యూపీలోని గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ ఆల్ఫా 1లో నివాసం ఉంటున్న నవీన్ రస్తోగి, అతడి భార్య అంజు రస్తోగిగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details