Car rammed youth ఝార్ఖండ్ గిరీడీహ్లో హోలీ పండగ రోజు ఓ కారు బీభత్సం సృష్టించింది. కొందరు యువకులు రోడ్డుపై రంగలు చల్లుకునే సమయంలో ఓ వాహనం అటువైపుగా వచ్చింది. దీంతో వారు దాన్ని ఆపి రంగులు జల్లేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా ఆగ్రహించిన డ్రైవర్ కారును యువకులపైనుంచి దూసుకుపోనిచ్చాడు. దీంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ తీరుతో కోపోద్రిక్తులైన స్థానికులు కారును ధ్వంసం చేశారు. అందులో ఉన్న డ్రైవర్, ప్యాసెంజర్లపై దాడి చేశారు. వెంటనే పోలీసుల రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.
Jharkhand news
బెంగబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోట్కీ ఖార్గడీహా ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ యువకుడి పేరు వాసుదేవ్ తూరి అని, అతను వారి బంధువుల ఇంట్లో ఉంటున్నాడని వెల్లడించారు. అతని కాలికి తీవ్ర గాయమైందన్నారు. కారును పోలీస్ స్టేషన్కు తరలించాడు.