ఉత్తర్‌ప్రదేశ్ మధురలో బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి రోడ్డు మధ్య భాగంలో పడిపోయాడు. అనంతరం హై స్పీడ్‌లో వెళ్తున్న మరో కారు అతడి శరీరం పైనుంచి వెళ్లింది. కారు కింద భాగంలో చిక్కుకుపోయిన అతడ్ని సుమారు 11 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో అతడు మృతి చెందగా.. శరీరం ఛిద్రమైంది. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి నోయిడా ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగింది.
అర్ధరాత్రి హైవేపై ప్రమాదం.. బాడీ పైనుంచి దూసుకెళ్లిన కారు.. 11కి.మీ అలానే ఈడ్చుకెళ్లాక..
బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిని గుర్తు తెలియని ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో అతడు రోడ్డు మధ్య భాగంలో పడిపోగా హై స్పీడ్‌లో వెళ్తున్న మరో కారు అతడి పైనుంచి వెళ్లింది. వాహనం కింద భాగంలో చిక్కుకుపోయిన అతడ్ని సుమారు 11 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్ మధురలో జరిగింది.
కారు కింద ఇరుక్కున్న మృతదేహాన్ని చూసుకోకుండా డ్రైవర్ చాలా దూరం ప్రయాణించాడు. కారు మాట్ టోల్ ప్లాజా వద్దకు చేరుకోగా మృతదేహాన్ని భద్రతా సిబ్బంది చూశారు. అప్పటికే డెడ్ బాడీ పూర్తిగా ఛిద్రమైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
కారు నడిపిన వ్యక్తి తన భార్యతో కలిసి ఆగ్రా నుంచి నొయిడాకు వస్తున్నట్లు విచారణలో చెప్పాడని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. యువకుడి మృతదేహం కారు కింద ఇరుక్కున్నట్లు తనకు తెలియదని అన్నట్లు వివరించారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రస్తుతం మృతుడిని గుర్తించే పనిలో ఉన్నారు.