car accident in Jhalawar: రాజస్థాన్‌లోని ఝలావర్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనం కాగా.. ఒకరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుడిని ఝలావర్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ అగ్నిప్రమాదంలో మధ్యప్రదేశ్ జిల్లాలోని దుంగార్‌గావ్ చెందిన అన్నాదమ్ములు నారాయణ్ సింగ్, భాను మరణించగా మరో ఇద్దరు సజీవ దహనమయ్యారు.
రెండు కార్లు ఢీకొని మంటలు.. నలుగురు సజీవ దహనం - రెండు కార్లు ఢీకొనగా మంటలు
car accident in Jhalawar: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు సజీవ దహనం అయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
రెండు కార్లు ఢీకొని మంటలు
ఘటనలో ప్రాణనష్టం ఇంకా ఎక్కువ జరిగిందా అనే విషయంపై స్పష్టత రాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ఘటనతో పోలీసులు ట్రాఫిక్‌ను మల్లించారు. మృతులందరూ మధ్యప్రదేశ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వారి వివరాలు తెలుసుకుని బంధువులకు తెలియజేస్తామన్నారు.
ఇదీ చదవండి:ఇల్లు తగలబెట్టి రూ.2లక్షలు బూడిద చేసిన ఎలుక