captain varun singh: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ భౌతకకాయానికి.. కర్ణాటక బెంగళూరులోని యెలహంక ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఐఏఎఫ్ నివాళులర్పించింది.
నివాళులర్పిస్తున్న వాయుసేన ఉన్నతాధికారులు యెలహంక ఎయిర్ బేస్‌లో వరుణ్ సింగ్ భౌతికకాయం భారత వాయుసేనలోని ఉన్నతాధికారులు, సైనికులు వరుణ్ సింగ్ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
వరుణ్ సింగ్ భౌతిక కాయానికి నివాళులు అనంతరం.. వరుణ్ సింగ్ భౌతికకాయాన్ని యెలహంక ఎయిర్ బేస్ నుంచి వాయుమార్గంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు తరలించారు.
మృత్యువుతో పోరాడి..
డిసెంబర్ 8న తమిళనాడు కూనూర్ సమీపంలో వాయుసేనకు చెందిన చాపర్ కూలిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోయినట్లు వాయుసేన అదేరోజు ప్రకటించింది. మృతుల్లో భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది సిబ్బంది మరణించారు. తీవ్రంగా గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌కు తొలుత వెల్లింగ్టన్ మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కొద్దిరోజులకు బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. 8 రోజులు మృత్యువుతో పోరాడిన అనంతరం బుధవారం కన్నుమూశారు.
ఇదీ చూడండి:
Varun Singh: మృత్యువుతో పోరాడి ఓడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్