డిప్యుటేషన్‌పై పనిచేయాలని కేంద్రం నుంచి నోటీసులు అందుకున్న బంగాల్ క్యాడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్‌లను వదులుకునేది లేదని దీదీ సర్కార్ తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ప్రత్యుత్తరం పంపింది.
కేంద్ర డిప్యూటేషన్‌కు రావాలని బంగాల్ ప్రభుత్వానికి పంపిన నోటీసుపై ఆ రాష్ట్ర యంత్రాంగం స్పందించిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
"ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్ర డిప్యుటేషన్‌పై పంపించాలన్న కేంద్ర హోంశాఖ ఆదేశాలపై బంగాల్ ప్రభుత్వం నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. కేంద్ర డిప్యుటేషన్ కోసం వారిని వదులుకునేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది."