తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బంగారం స్మగ్లింగ్ ఉగ్రవాద చర్యేనా?'

బంగారం అక్రమ రవాణాను ఉగ్ర చర్యగా పరిగణించాలా లేదా అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు కేంద్రం, జాతీయ దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీచేసింది.

By

Published : Mar 9, 2021, 10:48 PM IST

can gold smuggling be termed as terrorist activity: sc to examine
'బంగారం స్మగ్లింగ్ 'ఉగ్రవాద చర్యే'నా?'

బంగారం స్మగ్లింగ్​ను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద 'ఉగ్రవాద చర్య'గా పరిగణించవచ్చా లేదా అనే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇటీవల యూఏపీఏ చట్టం కింద నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ను కొట్టివేయాలని దాఖలైన ఓ పిటిషన్​ను రాజస్థాన్​ హైకోర్టు తిరస్కరించింది. దానిని సవాలు చేస్తూ వేసిన వ్యాజ్యంపై కేంద్రం, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇదీ కేసు..

గతేడాది జులైలో జైపూర్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.5 కేజీల బంగారం అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు మహ్మద్ అస్లాం. దానిని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత అతడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అనంతరం ఈ కేసు ఎన్​ఐఏకు బదిలీ అయ్యింది.

మారిన ఎఫ్​ఐఆర్​..

అయితే ఈ కేసును ఎన్​ఐఏకు తరలించిన తర్వాత.. దేశ ఆర్థిక భద్రత, ద్రవ్య స్థిరత్వాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో బంగారం స్మగ్లింగ్​ చేశాడని ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు పిటిషనర్(అస్లాం)​ తరపు న్యాయవాది తెలిపారు. పిటిషనర్​కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు తేలలేదని, అతడి నేపథ్యం అనుమానాస్పదంగా లేదని చెప్పారు.

యూఏపీఏ కింద ఎన్​ఐఏ అరెస్టు, దర్యాప్తు చేయకుండా స్టే కోరుతూ అస్లాం పిటిషన్ దాఖలు చేశాడు. బంగారం అమ్మడం ద్వారా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతాననే అనుమానంతో ఆ ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు ఆరోపించాడు. అయితే స్మగ్లింగ్ చేసిన బంగారం ఉగ్ర చర్యలకు నిధులు సమకూర్చడానికేనని రికార్డుల్లో ఎన్​ఐఏ పేర్కొనలేదని అస్లాం చెప్పారు. కానీ తనపై నమోదు చేసిన సెక్షన్ 15 మాత్రం.. దేశ ఆర్థిక భద్రతకు హాని కలిగించే ఉద్దేశంతో చేసే పనులను ఉగ్రచర్యలుగా పరిగణిస్తుందని వివరించారు.

ఇదీ చూడండి:బ్రిటన్​ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు

ABOUT THE AUTHOR

...view details