గతేడాది తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను(Farm laws repealed) రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా(rajasthan governor). సాగు చట్టాల(Farm laws 2020) గురించి రైతులను ఒప్పించేందుకు కేంద్రం ప్రయత్నించిందని, కానీ, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. రైతులు ఆందోళనకు దిగిన క్రమంలో ఆ చట్టాలను ఉపసంహరించుకోవటం(farm laws repeal) సముచితమైనదేనని తెలిపారు.
" సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించటం హర్షనీయం. రైతులు ఆందోళనకు దిగినందున ఆ నిర్ణయం సరైనదే. అలాగే, అవసరమైతే సాగు చట్టాలను తిరిగి తీసుకురావొచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సరైన అడుగు వేసిందనే నా ఆలోచన."
- కల్రాజ్ మిశ్రా, రాజస్థాన్ గవర్నర్.
సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు(farm laws repeal) ప్రకటించి.. పాకిస్థాన్ జిందాబాద్, ఖలిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు ఇచ్చే వారి తప్పుడు ప్రణాళికలకు ప్రధాని తెర దించారని పేర్కొన్నారు భాజపా ఎంపీ సాక్షి మహరాజ్. వ్యవసాయ చట్టాల రద్దుకు యూపీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో భాజపా 300కుపైగా సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రివర్గ భేటీలో తీర్మానం
3 వ్యవసాయ చట్టాలను రద్దు(farm laws repeal) చేస్తున్నట్లు మోదీ ప్రకటించిన వేళ ఈ ప్రక్రియను అధికారికంగా పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నెల 24న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ చట్టాల రద్దుకు తీర్మానం చేయనున్నట్లు సమాచారం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 29న ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టి రద్దు ప్రక్రియను లాంఛనంగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది.
మోదీ ప్రకటన..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను (Farm laws 2020) రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 19వ తేదీన స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని (Farm laws repeal) పేర్కొన్నారు. దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఇక ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లాలని కోరారు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. సాగు చట్టాలపై రైతులను ఒప్పించటంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే పని చేస్తోందని ఉద్ఘాటించారు. గురునానక్ జయంతి (Guru nanak jayanti) సందర్భంగా జాతిని ఉద్దేశించి (PM Narendra Modi addresses the nation) ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ కీలక ప్రకటన చేశారు.
ఇదీ చూడండి:కొత్త సాగు చట్టాల రద్దు.. రైతులకు మోదీ క్షమాపణలు