బంగాల్లో ఏడో దఫా ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. 34 అసెంబ్లీ స్థానాల్లో.. ఈ నెల 26న (సోమవారం) ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలో కరోనా కేసులు విస్తరిస్తున్న వేళ ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఈ మేరకు ఓటింగ్‌కు మూడు రోజుల ముందే ప్రచారం ముగించాలని ఆయా పార్టీలకు సూచించింది. దీంతో పోలింగ్‌కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారానికి తెరపడింది.
మొత్తం 86,78,221 మంది ఓటర్లు ఈ ఏడో దశలో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 44,44,634 మంది పురుషులు ఉండగా.. 42,33,358 మంది స్త్రీలు ఉన్నారు. 229 మంది ట్రాన్స్జెండర్లు కూడా ఓటింగ్‌లో భాగం కానున్నారు. 14,480 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. మొత్తం 34 స్థానాలకు గానూ 12,068 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది.