తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల ప్రచార ఆంక్షల్లో మరిన్ని సడలింపులు.. వాటికి ఈసీ ఓకే - ప్రచార ఆంక్షలు సడలింపు

Campaign restrictions Assembly Elections: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ప్రచారాలపై విధించిన ఆంక్షలను సడలించింది ఎన్నికల సంఘం. 50 శాతం సామర్థ్యంతో సభలు, ర్యాలీలు, రోడ్​షోలకు అనుమతించింది.​

Campaign restrictions Assembly Elections
Campaign restrictions Assembly Elections

By

Published : Feb 22, 2022, 9:48 PM IST

Updated : Feb 22, 2022, 11:00 PM IST

Campaign restrictions Assembly Elections: కరోనా వ్యాప్తి వేళ ప్రచారాలపై ఆంక్షలు విధించిన భారత ఎన్నికల సంఘం(ఈసీ).. వాటిని క్రమంగా సడలిస్తోంది. తాజాగా సమావేశాలు, రోడ్​షోలపై ఉన్న పరిమితులను సడలించింది.

రాజకీయ పార్టీలు, నేతలు.. 50 శాతం సామర్థ్యంతో సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌షోలను నిర్వహించుకోవచ్చని ఈసీ తెలిపింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(ఎస్​డీఎంఏ) నిబంధనలకు లోబడి.. జిల్లా అధికారుల ముందస్తు అనుమతితో రోడ్‌షోలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పటికే ఉన్న ఇతర నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

కరోనా నేపథ్యంలో ఎన్నికల జరుగుతున్న రాష్ట్రాల్లో జనవరి 8న పాదయాత్ర, రోడ్​షోలు, ర్యాలీలు, సభలపై ఈసీ ఆంక్షలు విధించింది. అయితే దేశంలో కొవిడ్​ కేసులు భారీగా తగ్గిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను సమీక్షించిన ఈసీ.. ఆంక్షలను సడలించింది.

గోవా, పంజాబ్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగా.. ప్రస్తుతం మణిపుర్​లో రెండు దశల , ఉత్తర్​ప్రదేశ్​లో 5,6,7 విడతల పోలింగ్​కు ప్రచారం జరుగుతోంది.

ఇదీ చూడండి:21 అడుగులు ఎత్తయిన చెరకు తోట- కుబేరుడైన రైతు!

Last Updated : Feb 22, 2022, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details