దేశంలోని ఇతర ప్రాంతాల వ్యక్తులను 'బయటి వారు'గా సంబోధించటం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్. నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 'ఎన్నికల సమయంలో వచ్చి హింసను ప్రేరేపించే బయటి వ్యక్తులకు రాష్ట్రంలో స్థానం లేదు' అని పేర్కొనటాన్ని సూచిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"ఏ కారణం చేత దేశంలోని ఇతర ప్రాంత వ్యక్తులను బయటి వారిగా పరిగణిస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఈ సంస్కృతి రాజ్యాంగ విరుద్ధం. అలా మాట్లాడాలనుకునే వారిని భారత రాజ్యాంగం చదవాలని కోరాలనుకుంటున్నా. రాజ్యాంగాన్ని రక్షించటం గవర్నర్ బాధ్యత. రాష్ట్ర రాజకీయాలతో ప్రేరేపితమై ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు రాష్ట్ర పోలీసులు, అధికారులు. అది ప్రజాస్వామ్యం, చట్టాలకు చాలా పెద్ద ప్రమాదం. రాజకీయాల కోసం ప్రత్యర్థులపై దాడులు చేయొద్దు."
- జగ్దీప్ ధన్కర్, బంగాల్ గవర్నర్