దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్‌కు సిద్దంగా ఉన్న స్పైస్‌జెట్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదని.. భద్రతా కారణాల దృష్ట్యా పూర్తిగా తనిఖీలు చెప్పట్టినట్లు అధికారులు వెల్లడించారు.
టేకాఫ్‌కు సిద్ధమైన విమానానికి బాంబు బెదిరింపు.. ఫేక్ కాల్‌గా గుర్తింపు - స్పైస్‌జెట్ విమానంలో బాంబు న్యూస్
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్‌కు సిద్దంగా ఉన్న స్పైస్‌జెట్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎటువంటి అనుమానిత వస్తువులు దొరకలేదని.. భద్రతా కారణాల దృష్ట్యా పూర్తిగా తనిఖీలు చేపట్టిన అధికారులు అది ఫేక్ కాల్‌గా తేల్చారు.
గురువారం సాయత్రం దిల్లీ నుంచి పుణె వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో బాంబు ఉందని ఓ అగంతకుడు నుంచి కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే ఆ సమయంలో ప్రయాణికులు బోర్డింగ్ గేట్ వద్ద ఉన్నారని.. విమానంలోకి ఎవరూ ఎక్కలేదని విమానాశ్రయ అధికారులు చెప్పారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగానే ఉన్నట్లు వెల్లడించారు. ఆ కాల్ చేసిన వ్యక్తిని కనిపెట్టి.. అది బూటకపు కాల్‌గా తేల్చే పనిలో ఉన్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తనిఖీల్లో విమానంలో బాంబు లేదని అది ఫేక్ కాల్‌గా తేల్చారు విమానాశ్రయ అధికారులు. అనంతరం ఆ స్పైస్‌జెట్ విమానం కాస్త ఆలస్యంగా దిల్లీ నుంచి పుణెకు బయలుదేరింది.