తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో హింసపై సీబీఐ విచారణకు ఆదేశం - బంగాల్ అల్లర్లపై సీబీఐ సిట్​

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన అల్లర్లపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది కలకత్తా హైకోర్టు. సీబీఐ ఆరు వారాల్లో తన నివేదికను సమర్పించాలని సూచించింది.

Calcutta HC
కలకత్తా హై కోర్టు

By

Published : Aug 19, 2021, 12:47 PM IST

బంగాల్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హత్యలు, అత్యాచారం వంటి హింసాత్మక ఘటనలపై కల​కత్తా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఘటనలకు సంబంధించి ఇతర కేసుల విచారణకు కోల్‌కతా పోలీసు కమిషనర్‌ సౌమేన్‌ మిత్రా సహా ముగ్గురు ఐపీఎస్‌ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది.

సీబీఐ తమ దర్యాప్తు నివేదికను ఆరు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించింది. ఈ రెండు దర్యాప్తులను తాము పర్యవేక్షిస్తామని హైకోర్టు తెలిపింది. బంగాల్‌ శాసనసభ ఎన్నికల తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తగా పలువురు చనిపోయారు. ఆస్తి నష్టం కూడా సంభవించింది.

ఇదీ చదవండి:'సుప్రీంకోర్టులో త్వరలోనే భౌతిక విచారణ'

ABOUT THE AUTHOR

...view details