తమ రిజిస్ట్రీ విభాగంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణణ్. ఓ కేసుకు సంబంధించి హెబియస్ కార్పస్ పటిషన్‌ను 23ఏళ్ల క్రితం ఓ మహిళ దాఖలు చేసినా పట్టించుకోకపోవటంపై అభ్యంతరం తెలిపారు. ఓ తల్లి ఆసుపత్రిలో పుట్టిన తన బిడ్డను తనకు ఇవ్వాలని కోరుతూ కోల్‌కతా హైకోర్టులో 1997, డిసెంబర్ 22న పిటిషన్ దాఖలు చేశారు.
" సాధారణంగా ఏ పిటిషన్ దాఖలు చేసినా 3మూడు నెలల్లో మా దృష్టికి రావాలి. కానీ ఈ కేసు 23ఏళ్ల తరువాత వచ్చింది. ఈ పిటిషన్‌ను ముగించటం తప్ప పరిష్కారం లేదు. రిజిస్ట్రీ విభాగంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. సమయానికి పిటిషన్లను లిస్ట్‌లో చేర్చకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం."