తెలంగాణ

telangana

ETV Bharat / bharat

HIV పాజిటివ్​ వ్యక్తులతో కాఫీ షాప్​- దేశంలోనే తొలిసారి, ఎక్కడో తెలుసా? - aids day 2023

Cafe Positive Run By HIV Positive People In Kolkata : ఓ కాఫీ షాప్​ను 14 మంది టీనేజర్లు కలిసి నడిపిస్తున్నారు. అయితే అందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? వాళ్లంతా హెచ్​ఐవీ పాజిటివ్​ వ్యక్తులు. ప్రస్తుతం ఈ కాఫీ షాప్​కు మంచి స్పందన వస్తోంది. డిసెంబరు 1న ఎయిడ్స్ డే సందర్భంగా.. ఇంతకీ ఆ కాఫీ షాపు ఎక్కడ ఉంది? ఎవరు ప్రారంభించారు? అనే విషయాలు తెలుసుకుందాం.

Cafe Positive Run By HIV Positive People In Kolkata
Cafe Positive Run By HIV Positive People In Kolkata

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 6:36 AM IST

హెచ్​ఐవీ పాజిటివ్​ వ్యక్తులతో కాఫీ షాప్​ - దేశంలోనే తొలిసారి, ఎక్కడో తెలుసా?

Cafe Positive Run By HIV People In Kolkata : బంగాల్​లోని సౌత్ కోల్​కతాలో 'కేఫ్​ పాజిటివ్​' అనే కాఫీ షాప్​ను నడుపుతున్నారు 14మంది టీనేజర్లు. అయితే వారంతా హెచ్​ఐవీ ఉన్నవాళ్లే. సమాజంలో హెచ్​ఐవీపై ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగించే లక్ష్యంతోనే ఈ కేఫ్​ను 'కాఫీ బిహైండ్​ బౌండరీస్' అనే ట్యాగ్​లైన్​తో ప్రారంభించారు సామాజిక కార్యకర్త కల్లోల్​ ఘోష్.

"నా స్నేహితుడు సాయంతో నేను జోధ్​పుర్​ పార్క్​లో ఒక చిన్న గ్యారేజ్​ని లీజ్​కి తీసుకుని ప్రారంభించాను. అప్పుడు మంచి స్పందన వచ్చింది. 64ఏ లేక్​ వ్యూ రోడ్డు వద్ద గత మూడున్నర ఏళ్లుగా 'కేఫ్​ పాజిటివ్​'ని విజయవంతంగా నడుపుతున్నాం."
-కల్లోల్​ ఘోష్​, కేఫ్​ పాజిటివ్​ వ్యవస్థాపకుడు

హెచ్​ఐవీ ఉన్న వ్యక్తులకు అవగాహన పెంపొందించటమే కాకుండా.. వాళ్లకు ఉపాధిని కల్పించటమే కేఫ్​ పాజిటివ్​ ప్రధాన లక్ష్యం.

"నేను హాస్టల్​లో ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్యే ఉన్నాను. ఇప్పుడు ఈ కేఫ్​లో మంచి చేయటం సంతోషంగా ఉంది. ఈ కేఫ్​ వల్ల హెచ్ఐవీ పాజిటివ్​ వ్యక్తులపై ఉన్న ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. కేఫ్​కి వచ్చిన వాళ్లకి నేనే ఫుడ్​ను అందిస్తున్నాను. వాళ్లు కూడా మంచిగా స్పందిస్తున్నారు."
-కేఫ్​ వర్కర్

విద్యార్థులు, ప్రముఖులు కేఫ్​కు..
ఈ కేఫ్​కు విద్యార్థులు, నగరానికి చెందిన కొంతమంది ప్రముఖులు తరచుగా వస్తుంటారు. "చాలా మంది హెచ్​ఐవీ, ఎయిడ్స్ అనేవి ఒకటే అనుకుంటారు. కానీ ఆ రెండు వేరు. హెచ్​ఐవీ అనేది ఒక వైరస్​. ఎయిడ్స్ అనేది ఇన్ఫెక్షన్​. హెచ్​ఐవీ రోగులు అందరూ ఎయిడ్స్ రోగులు కారు. సాధారణంగా ఒక వ్యక్తికి షుగర్​ లేదా బీపీ వచ్చినప్పుడు మందులు తీసుకుంటున్నారు. అలానే హెచ్​ఐవీ ఉన్నవాళ్లు కూడా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్​ నుంచి మందులు తీసుకోవాలి." అని కేఫ్​ పాజిటివ్​ వ్యవస్థాపకుడు కల్లోల్​ ఘోష్​ తెలిపారు. అలానే ప్రస్తుతం సమాజంలో హెచ్​ఐవీ సోకిన వ్యక్తుల పట్ల ఉన్న ప్రతికూల ఆలోచనలను అధిగమించడానికి ఈ కేఫ్​ సహాయపడుతుందని అంటున్నారు సామాజిక కార్యకర్త కల్లోల్​ ఘోష్​.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details