వ్యాక్సిన్ సరఫరా విషయమై రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కీలక సమావేశం నిర్వహించారు. టీకా పంపిణీకి జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వైద్య సేవల సిబ్బంది సహా టీకా కోసం ప్రాధాన్య జాబితాలో ఉన్న వారి వివరాలతో డేటాబేస్ తయారు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్‌లు, వైద్య శాఖ కార్యదర్శులు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.