Cyclone Jawad: జవాద్ తుపానును ఎదుర్కొనే సన్నాహాలను కేంద్రం సమీక్షించింది. ప్రాణ నష్టానికి అవకాశం లేకుండా.. ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలకు ఆదేశించింది. తుపాను.. శనివారం ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఈ మేరకు సమీక్షించారు.
రాష్ట్రాలు, కేంద్ర సంస్థల సంసిద్ధతను సమీక్షించిన గౌబా.. సముద్రంలో ఉన్న మత్స్యకారులు, వారి ఓడలను సంబంధిత సమాచారాన్ని సేకరించాలని దిశానిర్దేశం చేశారు. అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా సాధ్యమైనంత స్వల్ప వ్యవధిలో పునరుద్ధరించాలని.. ఇందుకోసం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్ ఆస్పత్రుల పనితీరుకు అంతరాయం లేకుండా చూసుకోవాలని సూచించారు. దీంతోపాటు తుపాను తర్వాత పరిస్థితులపై మరిన్ని సూచనలు చేశారు.
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆహార నిల్వలు, తాగునీరుతో పాటు ఇతర నిత్యవసర వస్తువుల సరఫరా దృష్టి సారించాలి.
- విద్యుత్, రోడ్లుతో పాటు అత్వసర సేవలను పునరుద్ధరించేందుకు సంబంధిత బృందాలను సంసిద్ధంగా ఉంచాలి.