కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గౌబాను మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1982వ బ్యాచ్ ఝార్ఖండ్ కేడర్‌కు చెందిన ఆయన పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. అయితే, నియామకాల మంత్రివర్గ సంఘం ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని నిర్ణయించినట్లు సిబ్బంది వ్యవహారాలశాఖ శనివారం రాత్రి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గౌబా మరో ఏడాది - రాజీవ్ గాబా న్యూస్
కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గౌబా మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాజీవ్ గాబా, కేబినెట్ సెక్రటరీ
కేంద్ర పట్టాణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా, హోంశాఖలో అదనపు సెక్రటరీగా పనిచేశారు గౌబా. ఆయన జన్మస్థలం పంజాబ్.
ఇదీ చదవండి:మూడడుగుల కొబ్బరిచెట్టు.. విరగ కాసేను చూడు!