తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎస్సీ పోస్ట్ మెట్రిక్‌ విద్యార్థులకు కేంద్రం తీపికబురు - మంత్రివర్గం

దేశంలోని ఎస్సీ పోస్ట్​ మెట్రిక్​ విద్యార్థులకు తీపికబురు అందించింది కేంద్ర ప్రభుత్వం. రూ. 7వేల కోట్లతో కొత్త ఉపకార వేతన పథకాన్ని అమలు చేయాలని కేంద్ర మంత్రి వర్గం తీర్మానించింది. ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతన పథకంలో డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరతాయని సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ తెలిపారు.

Cabinet nod for post metric scholorship for sc students
ఎస్సీ పోస్ట్ మెట్రిక్‌ విద్యార్థులకు కేంద్రం బొనాంజా

By

Published : Dec 23, 2020, 5:39 PM IST

దేశంలో ఒక కోటి మందికి పైగా ఉన్న ఎస్సీ పోస్ట్ మెట్రిక్‌ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం బొనాంజా ప్రకటించింది. 7వేల కోట్ల రూపాయలతో కొత్త ఉపకార వేతన పథకాన్ని అమలు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతన పథకంలో డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరతాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ తెలిపారు.

వంద శాతం పెట్టుబడులు

డీటీహెచ్​ సేవల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని వంద శాతానికి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వేర్వేరు సంస్థలుగా ఉన్న ఫిల్మ్​ డివిజన్‌, డెరెక్టర్‌ ఆఫ్‌ ఫిలిం ఫెస్టివల్స్‌, జాతీయ ఫిలిం ఆర్చివ్స్‌ ఆఫ్‌ ఇండియా, బాలల సినీ సంఘం, జాతీయ సినీ అభివృద్ధి కార్పొరేషన్‌ను విలీనం చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.

ఇదీ చదవండి :సాగు చట్టాలకు వ్యతిరేకంగా రెండు కోట్ల సంతకాల సేకరణ

ABOUT THE AUTHOR

...view details