తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్రమ నిర్మాణం కేసులో కోర్టు షాక్.. సొంతంగా భవనాన్ని కూల్చేస్తున్న కేంద్రమంత్రి - అక్రమ నివాాసాలు సుప్రీంకోర్టు

Narayan Rane Bungalow Demolition : కేంద్ర మంత్రి నారాయణ్​ రాణెకు షాక్ తగిలింది. ఆయన నిర్మించిన ఓ బంగ్లా అక్రమమని పేర్కొంటూ.. దాన్ని కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో.. రాణె స్వయంగా తన బంగ్లాను కూల్చివేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Nov 17, 2022, 11:04 AM IST

Updated : Nov 17, 2022, 12:46 PM IST

Narayan Rane Bungalow Demolition : కేంద్ర మంత్రి నారాయణ్​ రాణెకు షాక్​ తగిలింది. ఆయన అక్రమ నివాసాన్ని రెండు నెలల్లోగా కూల్చేయాలని సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. రాణె స్వయంగా తన బంగ్లాను కూల్చివేస్తున్నారు. అంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రమంత్రి నారాయణ్​ రాణె.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రెండు నెలల్లోగా బంగ్లాను కూల్చివేయాలని ఆదేశించింది.

కేంద్రమంత్రి నారాయణ్ రాణె బంగ్లా

కేసు ఏంటంటే?
ముంబయి.. జుహూ తీరంలో ఉన్న నారాయణ రాణె బంగ్లా నిర్మాణంలో 'కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌, ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌' నిబంధనలు ఉల్లంఘించారని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఫిర్యాదు అందింది. దీంతో బీఎంసీ అధికారులు తనిఖీ చేయగా.. అక్రమ కట్టడాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ కట్టడాలను రెగ్యులరైజ్‌ చేసేందుకు రాణె కుటుంబానికి చెందిన కంపెనీ దరఖాస్తు చేసుకుంది. కానీ, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కారణంగా ఈ ఏడాది జూన్‌లో ఆ దరఖాస్తును బీఎంసీ తిరస్కరించింది. దీంతో ఆ కంపెనీ మరోసారి దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తును పరిశీలించేలా బీఎంసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది.

అయితే ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ దరఖాస్తును అంగీకరిస్తే.. అక్రమ కట్టడాల నిర్మాణాలను ప్రోత్సహించినట్లు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. రాణె కంపెనీ నిబంధనలను విరుద్ధంగా ఆ నిర్మాణాన్ని చేపట్టిందని, బీఎంసీ నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని నిర్ధరణ అయ్యిందని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్రమంత్రి నారాయణ్​ రాణె.. సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది.

Last Updated : Nov 17, 2022, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details