తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో కేబినెట్ విస్తరణ- జితిన్ ప్రసాదకు స్థానం - యూపీ కేబినెట్ మార్పులు

ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భాజపా.. రాష్ట్రంలో మంత్రివర్గాన్ని విస్తరించింది. (UP Cabinet Expansion News) ఓటర్లపై ప్రభావం చూపే కీలక నేతలకు కేబినెట్​లో స్థానం కల్పించింది.

up cabinet expansion
ఉత్తర్​ప్రదేశ్ మంత్రివర్గం

By

Published : Sep 26, 2021, 6:11 PM IST

Updated : Sep 26, 2021, 6:31 PM IST

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్​ప్రదేశ్ మంత్రివర్గంలో (UP Cabinet Expansion News) కీలక మార్పులు చేసింది భాజపా. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ.. కేబినెట్​ను పునర్​వ్యవస్థీకరించింది. (UP Cabinet Reshuffle) కొత్తగా ఆరుగురిని మంత్రివర్గంలో చేర్చుకుంది.

ఇటీవల కాంగ్రెస్​ నుంచి భాజపాలో చేరిన సీనియర్ నేత జితిన్ ప్రసాద మంత్రివర్గంలో (Jitin Prasada latest news) చోటు దక్కించుకున్నారు. బ్రాహ్మణ వర్గం ఓటర్లపై ఈయనకు మంచి పట్టుంది. ఇది తమకు కలిసొస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.

ప్రమాణస్వీకారం చేస్తున్న జితిన్ ప్రసాద

ప్రసాదతో పాటు ఛత్రపాల్ సింగ్ గంగ్వార్, పల్తూ రామ్, సంగీత బల్వంత్, సంజీవ్ కుమార్, దినేశ్ ఖాటిక్, ధరమ్​వీర్ సింగ్​ను మంత్రివర్గంలో చేర్చుకుంది యోగి సర్కార్.

ప్రమాణస్వీకారం చేస్తున్న ఎమ్మెల్యేలు పల్తూరామ్, సంగీత బల్వంత్, సంజీవ్ కుమార్, దినేశ్ ఖాటిక్

ఇదీ చదవండి:

Last Updated : Sep 26, 2021, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details