దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం సహా అనేక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ బ్యాటరీ తయారీ కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు 18వేల ఒక వంద కోట్ల రూపాయలతో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
భారీగా పెట్టుబడులు
" ఈ పథకం ద్వారా విద్యుత్ బ్యాటరీ కంపెనీల ఉత్పత్తి రంగంలో 45వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. మంత్రివర్గ నిర్ణయం వల్ల దేశంలో జీవ ఇంధనం సహా ప్రకృతి వనరులైన కాపర్, బాక్సైట్ వినియోగం కూడా పెరుగుతుంది."