ఆకాశ్ క్షిపణి వ్యవస్థను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. క్షిపణి వ్యవస్థ కోసం ఇతర దేశాలు చేసుకొనే దరఖాస్తులను పరిశీలించి.. సత్వర అనుమతులను ఇచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే విదేశాలకు ఎగుమతి చేసే ఆకాశ్ వెర్షన్ ప్రస్తుతం భారత దళాలు ఉపయోగిస్తున్నదానితో పోలిస్తే భిన్నంగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 5 బిలియన్ డాలర్ల ఆయుధాల ఎగుమతే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని తెలిపారు. దీంతోపాటు స్నేహపూర్వక దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని యత్నిస్తున్నట్లు చెప్పారు.