తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్టాక్​ ఎక్స్చేంజీలో ఈసీజీసీ లిస్టింగ్​కు కేంద్రం గ్రీన్​సిగ్నల్​

ఎక్స్​పోర్ట్​ క్రిడెట్​ గ్యారంటీ కార్పొరేషన్​ లిమిటెడ్​ను ఐపీఓ ద్వారా స్టాక్​ ఎక్స్చేంజీలో నమోదు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెప్పింది. మూలధన పెట్టుబడిగా రూ. 4,400 కోట్లు పెట్టనున్నట్లు స్పష్టం చేసింది. బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్​ పలు నిర్ణయాలు తీసుకుంది.

Cabinet approves listing of ECGC, capital inusion of Rs 4,400 cr
స్టాక్​ ఎక్స్చేంజీలో ఈసీజీసీ లిస్టింగ్​, ECGC

By

Published : Sep 29, 2021, 4:04 PM IST

Updated : Sep 29, 2021, 5:27 PM IST

ప్రధాన మంత్రి పోషణ్​ పథకానికి కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఈ స్కీం ద్వారా.. ప్రభుత్వ, ఎయిడెడ్​ పాఠశాలల్లో చదివే 11.2 లక్షల మందికిపైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకుర్​. ఇందుకోసం ఐదేళ్లకుగానూ.. రూ. లక్షా 31 వేల కోట్లు వెచ్చించనున్నట్లు స్పష్టం చేశారు.

స్టాక్స్​లోకి ఈసీజీసీ..

ప్రభుత్వ రంగ సంస్థ ఎక్స్​పోర్ట్​ క్రెడిట్​ గ్యారంటీ కార్పొరేషన్​ లిమిటెడ్​ను​ (ఈసీజీసీ) ఐపీఓ ద్వారా స్టాక్​ ఎక్స్చేంజీలో నమోదు చేసేందుకు కూడా కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఈసీజీసీ.. స్టాక్​ ఎక్స్చేంజీలో లిస్టవుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​.

ఎగుమతి దారులకు, బ్యాంకులకు మద్దతుగా నిలిచేందుకు.. ఐదేళ్లలో ఈసీజీసీ లిమిటెడ్​లో రూ.4,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఇది.. 59 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

''చిన్న ఎగుమతిదారులు ఎగుమతులు చేసినపుడు వారికి డబ్బులు రావడం ఇబ్బంది లేదా ఆలస్యం అయినా, డబ్బులు రాకున్నా అలాంటి పరిస్ధితుల్లో వారికి బీమా సౌకర్యాన్ని ఎగుమతుల పరపతి గ్యారెంటీ కార్పొరేషన్‌...ఈసీజీసీ కల్పిస్తుంది. ఈ పనులన్నింటిలో ఈసీజీసీ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్ధకు రూ.4వేల 4వందల కోట్ల అదనపు మూలధనం అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ సంస్ధ ద్వారా బీమా పాలసీలు తీసుకునే వాటిలో 97శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలు ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల అధిక లాభం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకే అందుతుంది.''

- పీయూష్​ గోయల్​, కేంద్ర మంత్రి

ఎన్​ఈఐఏకి గ్రాంట్​..

జాతీయ ఎగుమతి బీమా ఖాతా కొనసాగించడం సహా రాబోయే అయిదేళ్ల కాలంలో దీనికి 1650 కోట్ల రూపాయలను గ్రాంట్‌ ఇన్‌ రూపంలో అందించే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

కొంత కాలంగా స్టాక్​ మార్కెట్లోకి వచ్చే పబ్లిష్​ ఇష్యూల సంఖ్య పెరిగిపోయింది.

ఆదిత్య బిర్లా క్యాపిటల్, సన్ లైఫ్ ఏఎంసీల సంయుక్త సంస్థ.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ (Aditya Birla Sun Life AMC IPO) ఐపీఓకు వచ్చింది. దాదాపు రూ.2,770 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో బుధవారం ఐపీఓ ప్రారంభించింది. పెట్టుబడిదారులు కనీసం 20 ఈక్విటీ షేర్లకు, (ఒక లాట్​), గరిష్ఠంగా 14 లాట్​లకు బిడ్ చేయొచ్చు. రిటైల్ పెట్టుబడిదారుల కనీస పెట్టుబడి సింగిల్ లాట్ కోసం రూ.14,240గాను, గరిష్ఠంగా 14 లాట్ల కోసం రూ.1,99,360 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఇవీ చూడండి:2045 వరకు చమురే ప్రధాన ఇంధన వనరా?

పసిడి ఎక్స్ఛేంజీ ఏర్పాటుకు సెబీ బోర్డు ఆమోదం

Last Updated : Sep 29, 2021, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details