తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Cabinet Decision today: 32వేల కి.మీ రోడ్ల నిర్మాణం- 7,287 గ్రామాల్లో టెలికాం టవర్లు

మారుమూల ప్రాంతాల్లో 32 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం (Cabinet Decision today) ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 33,822 కోట్లు ఖర్చు చేయనుంది మోదీ సర్కార్. అంతేకాకుండా 7,287 గ్రామాలకు టెలికాం సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు పచ్చజెండా ఊపింది.

Cabinet meeting
కేంద్రమంత్రి వర్గం పచ్చజెండా

By

Published : Nov 17, 2021, 8:28 PM IST

దేశంలో మారుమూల ప్రాంతాల్లో రూ.33,822 కోట్ల వ్యయంతో.. 32,152 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం () ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద గిరిజన, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అడవులు, పర్వతాలు, నదుల మీదుగా ఈ రోడ్ల నిర్మాణం ఉంటుంది.

మరోవైపు, గిరిజన ప్రాంతాల్లోని 7,287 గ్రామాల్లో టెలికాం టవర్లు ఏర్పాటు చేసి కనెక్టివిటీని పెంచడానికి కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ఇందుకోసం సుమారు రూ. 6,466 కోట్లను వెచ్చించనుంది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది.

ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈ టవర్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా 42 జిల్లాల్లో 4జీ సేవలతో టెలికాం కనెక్టివిటీ మెరుగుపడనుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. డిజిటల్ ఇండియా లక్ష్యాలను సాధించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల వ్యాపారం, ఇ-కామర్స్​, విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు.

రోడ్ల నిర్మాణంతోనే గ్రామీణాభివృద్ధి..

మారుమూల ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం.. గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వీటితో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. తీవ్రవాదంపై కూడా కేబినెట్​ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం చూపిస్తుందన్నారు. కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాల్లో ఒకటైన.. మారుమూల ప్రాంతాల్లో టవర్ల నిర్మాణంతో సామాజిక సాధికారత చేకూరుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:దేశంలోనే తొలి ఆహార మ్యూజియం.. అందరికీ అవగాహనే లక్ష్యం!

ABOUT THE AUTHOR

...view details