Cab Driver Extorted Rs 22 lakh From Woman : తన క్యాబ్‌లో ప్రయాణించిన మహిళను మోసం చేశాడు ఓ డ్రైవర్. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో చిన్ననాటి స్నేహితుడితో ఆమె సంభాషణను విని.. మొత్తం 22 లక్షల రూపాయలు రాబట్టుకున్నాడు. అలాగే ఆమెను బెదిరించి 750 గ్రాముల బంగారాన్ని సైతం తీసుకున్నాడు. నగల గురించి బాధితురాలిని ఆమె భర్త నిలదీయడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది.
క్యాబ్‌లో ఆమె సీక్రెట్ కాల్ విని.. బ్లాక్ మెయిల్ చేసి రూ. 22లక్షలు, బంగారం దోపిడీ.. చివరకు.. - cab driver robbery in karnataka
Cab Driver Extorted Rs 22 lakh From Woman : కర్ణాటకలో ఓ మహిళను మోసం చేశాడు క్యాబ్ డ్రైవర్. కొద్ది రోజుల క్రితం తన క్యాబ్‌లో ప్రయాణించిన మహిళను.. తన చిన్నప్పటి క్లాస్మేట్లా నమ్మించాడు. ఫోన్ చేసి ఆమె నుంచి రూ.22 లక్షలు రాబట్టుకున్నాడు. అలాగే 750 గ్రాముల బంగారాన్ని తీసుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే?
![క్యాబ్‌లో ఆమె సీక్రెట్ కాల్ విని.. బ్లాక్ మెయిల్ చేసి రూ. 22లక్షలు, బంగారం దోపిడీ.. చివరకు.. cab-driver-extorted-rs-22-lakh-from-women-and-750-grams-gold-jewelry-in-karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-08-2023/1200-675-19167659-thumbnail-16x9-photo.jpg)
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. 2022 డిసెంబర్లో ఇందిరానగర్ నుంచి బాణసవాడి వరకు క్యాబ్‌ను బుక్ చేసుకుంది. అనంతరం కారెక్కి తన చిన్ననాటి స్నేహితుడితో ఫోన్లో మాట్లాడింది. తన మాటలు మొత్తం విన్న క్యాబ్ డ్రైవర్కిరణ్.. కొద్ది రోజుల తరువాత బాధితురాలికి మెసేజ్ చేశాడు. తాను బాధితురాలి చిన్నప్పటి క్లాస్మేట్ని అంటూ పరిచయం పెంచుకున్నాడు. అనంతరం మరికొన్ని రోజులకు ఫోన్ చేసి తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. రూ.22 లక్షల సాయం కావాలని కోరాడు. దీంతో క్యాబ్ డ్రైవర్కిరణ్ మాటలు నమ్మిన బాధితురాలు.. వెంటనే ఆ సొమ్మును అతడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసింది. కొద్ది రోజుల తరువాత కిరణ్ మోసాన్ని తెలుసుకున్న బాధితురాలు విషయం ఎవ్వరికి చెప్పకుండా.. క్యాబ్ డ్రైవర్‌ను దూరం పెట్టింది.
ఏప్రిల్‌లో బాధితురాలికి మళ్లీ ఫోన్ చేసిన కిరణ్.. బంగారాన్ని ఇవ్వమని డిమాండ్ చేశాడు. లేకపోతే ఆ రోజు క్యాబ్‌లో తన స్నేహితుడితో మాట్లాడిన విషయాన్ని ఆమె భర్తకు చెబుతానని బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు.. 750 గ్రాముల బంగారాన్ని నిందితుడికి ఇచ్చింది. కొంత కాలంగా ఇంట్లో అభరణాలు కనిపించకపోవడం వల్ల బాధితురాలిని నిలదీశాడు ఆమె భర్త. దీంతో జరిగిన విషయాన్ని మొత్తం భర్తకు వివరించింది బాధితురాలు. అనంతరం భార్యాభర్తలిద్దరూ కలిసి.. రామమూర్తినగర్ పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హర్సఘట్టలో నివాసం ఉండే కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.