దేశంలోని రెండు లోక్సభ, 14 శాసనసభ స్థానాల ఉప పోరుకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. మొత్తం 11 రాష్ట్రాల్లో జరిగే ఈ ఉప ఎన్నికలను ఏప్రిల్ 17న నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
లోక్సభ ఉప ఎన్నికల్లో.. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. వీటితో పాటు రాజస్థాన్లో 3, కర్ణాటకలో 2 అసెంబ్లీ స్థానాలు సహా.. గుజరాత్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లో ఒక్కో సీటుకు ఓటింగ్ జరగనుంది.