తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Bypoll Election: ఆ రాష్ట్రాల్లో ఉపఎన్నికల షెడ్యూల్​ వచ్చేసింది.. - బంగాల్​ ఉపఎన్నికలు

పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాలకు.. ఉపఎన్నికల షెడ్యూల్ (Bypoll Election)​ వచ్చేసింది. మొత్తం 3 లోక్​సభ, 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్​ 30న ఎన్నికలు జరగనున్నాయి.

Bypolls to three LS, 30 assembly seats on Oct 30: EC
bypolls ఉపఎన్నికలు

By

Published : Sep 28, 2021, 10:35 AM IST

Updated : Sep 28, 2021, 1:23 PM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్(Bypoll Election​) విడుదల చేసింది ఎలక్షన్​ కమిషన్​(ఈసీ). 3 లోక్​సభ, 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు అక్టోబర్​ 30న జరగనున్నాయి. నవంబర్​ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

కరోనా మహమ్మారి, వరదలు, పండుగలు, వాతావరణ పరిస్థితులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, ఆయా రాష్ట్రాలతో చర్చించాకే షెడ్యూల్​ ప్రకటించినట్లు తెలిపింది ఈసీ. దాద్రానగర్​ హవేలీ​, హిమాచల్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​లో లోక్​సభ ఉపఎన్నికలు జరగనుండగా.. పలు రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలు(Bypoll Election 2021) ఖాళీగా ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది.

అక్టోబర్​ 1న ఎన్నికల నోటిఫికేషన్​(Bypoll Election) రానుంది.

ఇవే ముఖ్య తేదీలు..

  • ఎన్నికల నోటిఫికేషన్​: అక్టోబర్​ 1
  • నామినేషన్ల స్వీకరణ గడువు: అక్టోబర్​ 8
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్​ 11
  • నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్​ 13
  • ఎన్నికల పోలింగ్​: అక్టోబర్​ 30
  • ఓట్ల లెక్కింపు: నవంబర్​ 2

లోక్​సభ ఎన్నికలు ఇక్కడే..

దాద్రా నగర్​ హవేలీ నియోజకవర్గం సహా హిమాచల్​ ప్రదేశ్​లోని మండీ, మధ్యప్రదేశ్​లోని ఖండ్వా స్థానాలకు లోక్​సభ బైపోల్​ జరగనుంది.

అసెంబ్లీ ఉపఎన్నికలు..

3 లోక్​సభ స్థానాలకు ఉపఎన్నికలతో పాటే.. వివిధ రాష్ట్రాల్లోని 30 స్థానాలకు అసెంబ్లీ బైపోలింగ్​ నిర్వహించనుంది ఎన్నికల సంఘం.

వీటిలో గరిష్ఠంగా అసోంలో 5 స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. బంగాల్​లో నాలుగు, మధ్యప్రదేశ్​, హిమాచల్​ ప్రదేశ్​, మేఘాలయలో 3 చొప్పున, బిహార్​, కర్ణాటక, రాజస్థాన్​లో 2 చొప్పున, ఆంధ్రప్రదేశ్​, హరియాణా, మహారాష్ట్ర, మిజోరం, నాగాలాండ్​, తెలంగాణలో ఒక్కో స్థానానికి ఉపఎన్నికల షెడ్యూల్​ విడుదలైంది.

హుజూరాబాద్​లో..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్​ ఉపఎన్నిక (Huzurabad By Election 2021) షెడ్యూల్ ఎట్టకేలకు వచ్చేసింది. పలు రాష్ట్రాల్లోని మిగతా 29 నియోజకవర్గాలతో పాటే.. ఇక్కడా అక్టోబర్​ 30న ఎన్నిక(Huzurabad By Election Polling 2021) జరగనుంది. ఉపఎన్నికకు అక్టోబర్ 2న నోటిఫికేషన్​ జారీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరపనున్నట్లు తెలిపింది. వాటి ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు విధించింది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు తెలిపింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్​లోని బద్వేలు ఉపఎన్నిక (Badwel By Election 2021) షెడ్యూల్ కూడా ఈసీ విడుదల చేసింది. అక్టోబర్ 30న ఉపఎన్నిక పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు ప్రకటన జారీ చేసింది.

ఇవీ చూడండి:Ganguly News: సౌరభ్​ గంగూలీకి కోల్​కతా హైకోర్టు జరిమానా

భవానీపుర్​ ఉపఎన్నికలో మార్పు లేదు.. హైకోర్టు స్పష్టం

పోలీస్​ స్టేషన్​లో భారీ పేలుడు

Election Notification 2021 : హుజూరాబాద్​, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

Last Updated : Sep 28, 2021, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details