దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కొవిడ్ నేపథ్యంలో పోలింగ్ కోసం తగిన జాగ్రత్తలు సహా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అసోంలోని 5, బంగాల్‌లో 4, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో 3 చొప్పున అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. బిహార్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలలో రెండు.. తెలంగాణ, ఏపీ, హరియాణా, మహారాష్ట్ర, మిజోరంలలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని బరిలోకి దిగాయి. చాలా సీట్లలో పోటీ ప్రధానంగా భాజపా, కాంగ్రెస్ మధ్య ఉన్నట్లు కనిపిస్తోంది.