తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Bhabanipur bypoll: ప్రశాంతంగా భవానీపుర్ పోలింగ్​

By-polls to Bhabanipur
భవానీపూర్​ పోలింగ్​

By

Published : Sep 30, 2021, 6:30 AM IST

Updated : Sep 30, 2021, 6:34 PM IST

18:00 September 30

బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) బరిలో ఉన్న భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోరు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 53.32 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్​ అంతా ప్రశాంతంగానే జరిగినట్లు చెప్పారు.  

చెదురుమదురు ఘటనలు

భవానీపుర్​లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద టీఎంసీ, భాజపా కార్యకర్తలకు మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది. నకిలీ ఓటర్లను పోలింగ్​ కేంద్రంలోకి టీఎంసీ పంపిస్తోందని భాజపా కార్యకర్తలు ఆరోపించారు. అయితే.. కేంద్ర బలగాలు పరిస్థితిని అదుపు చేశాయి. మరో చోట భాజపా, టీఎంసీ కార్యకర్తలకు మధ్య తలెత్తిన ఘర్షణలో భాజపా నేత కల్యాణ్​ చౌబే కారు ధ్వంసం అయింది.  

ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం..

భవానీపుర్ ఉపఎన్నికలో భాగంగా బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని మిత్ర ఇన్​స్టిట్యూట్​లో ఓటేశారు.

ఆరోపణలు ప్రత్యారోపణలు..

వార్డు నెంబర్​ 72లో ఓటింగ్​ ప్రక్రియను బలవంతంగా ఆపేందుకు టీఎంసీ ప్రయత్నించిందని భాజపా అభ్యర్థి టిబ్రేవాల్​ ఆరోపించారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్​ హకీమ్​, సుబ్రతా ముఖర్జీ యత్నించారని ఆరోపించారు. ఈ మేరకు ఎలక్షన్​ కమిషన్​ వారి ఇరువురిపై  ఫిర్యాదు చేశారు.  

అయితే.. ఈ ఆరోపణలను హకీమ్ తిప్పికొట్టారు. "రోడ్డు పక్కన టీకొట్టులో టీ తాగడం కూడా ఓటర్లను ప్రభావితం చేసినట్టేనా? ఉపఎన్నికల్లో ఓడిపాతమని భాజపాకు తెలుసు. అందుకే మాపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోంది" అని విమర్శించారు.  

పరస్పరం ఫిర్యాదులు..

టిబ్రేవాల్​ 20 కార్లలో వచ్చి ఓటర్లను ప్రభావితం చేశారని ఎలక్షన్ కమిషన్​కు టీఎంసీ ఫిర్యాదు చేసింది. అయితే.. తమ ఏజెంట్లను బూత్​లోపలికి టీఎంసీ కార్యకర్తలు పంపించట్లేదని ఆరోపిస్తూ భాజపా ఫిర్యాదు చేసింది.  

అయితే.. టీఎంసీ అక్రమాలకు పాల్పడిందంటూ భాజపా చేసిన ఫిర్యాదులు అన్నింటినీ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.

అక్టోబర్ 3న ఫలితం..

అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి ఓటమి చవిచూసిన మమతా బెనర్జీ.. ఈ ఉపఎన్నికలో భవానీపుర్‌ నుంచి పోటీ చేశారు. దీదీకి పోటీగా భాజపా నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. 

అక్టోబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

17:31 September 30

భవానీపుర్​లో సాయంత్రం 5 గంటల నాటికి 53.32 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సంసేర్​గంజ్ నియోజకవర్గంలో 78.6 శాతం, జంగీపుర్​లో 76.12 శాతం ఓట్లు నమోదైనట్లు వెల్లడించింది.

16:56 September 30

గొడవ..

బంగాల్​ భవానీపుర్​ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికలో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తృణమూల్​ కాంగ్రెస్​, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో భాజపా నేత కల్యాణ్​ చౌబే కారు ధ్వంసం అయింది. 

15:34 September 30

భవానీపుర్ ఉపఎన్నికలో భాగంగా బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని మిత్ర ఇన్​స్టిట్యూట్​లో ఓటేశారు.

48 శాతం పోలింగ్

కాగా, భవానీపుర్​లో మధ్యాహ్నం 3 గంటల నాటికి 48.08 శాతం ఓటింగ్ నమోదైంది. ఉపఎన్నిక జరుగుతున్న మరో రెండు స్థానాల్లో ఓటింగ్ శాతం మెరుగ్గానే ఉంది. సంషేర్​గంజ్​లో 72.45 శాతం, జంగీపుర్​లో 68.17 శాతంగా పోలింగ్ శాతం నమోదైంది.

14:07 September 30

మధ్యాహ్నం వరకు 35 శాతం పోలింగ్​..

బంగాల్​, ఒడిశాలో ఉపఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బంగాల్​ భవానీపుర్​లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35.97 శాతం ఓటింగ్​ నమోదైంది. సంషేర్​గంజ్​, జాంగిపుర్​లో వరుసగా 57.15, 53.78 శాతంగా నమోదయ్యాయి.

ఒడిశా పిపిలీ నియోజకవర్గంలో 45కుపైగా పోలింగ్​ శాతం నమోదైంది. 

10:33 September 30

ఓటేసిన రుద్రప్రతాప్..

ఒడిశాలోని పిపిలి నియోజకవర్గంలోనూ ఉపఎన్నిక జరుగుతోంది. రెండున్నర లక్షల మంది ఓటర్లు పది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. అధికార బీజేడీ అభ్యర్థి రుద్రప్రతాప్ మహారథి, భాజపా నాయకుడు ఆశ్రిత్‌ పట్నాయక్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి బిశ్వోకేషన్‌ హరిచందన్ మధ్య ప్రధాన పోటీ ఉంది. పిపిలిలో బీజేడీ అభ్యర్థి రుద్రప్రతాప్ మహారథి తన ఓట హక్కును వినియోంగించుకున్నారు.  

10:29 September 30

భవానీపుర్‌లో 7.57 శాతం పోలింగ్​

బంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్​ సాఫీగా సాగుతున్నట్లు ఎన్నికల అధికారులు తెలిలిపారు. ఉదయం 9 గంటల వరకు భవానీపుర్‌లో 7.57 శాతం , సంషేర్‌గంజ్‌లో 16.32 శాతం , జంగీపుర్‌లో 17.51 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

07:14 September 30

పోలింగ్​ ప్రారంభం

బంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. భవానీపుర్‌, జాంగీపుర్‌, సంషేర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. భవానీపుర్‌ అసెంబ్లీ స్థానం నుంచి బంగాల్​ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడింది. మమతకు పోటీగా భాజపా నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ పోటీ చేస్తున్నారు. అక్టోబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

06:58 September 30

ఓటమి భయంతో రాష్ట్ర ప్రభుత్వం..

ఎన్నికలు జరుగుతున్న పోలింగ్​ బూత్​లను సందర్శిస్తాని తెలిపారు భవానీపూర్​ నియోజకవర్గంలో భాజపా తరఫున పోటీ చేస్తున్న ప్రియాంక తిబ్రెవాల్​. రాష్ట్ర ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు.  

"ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయనే నమ్మకం ఉంది. భద్రతా ఏర్పాట్లు చాలా ముఖ్యం. ఈరోజు నేను పోలింగ్​ బూత్​లను సందర్శిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఓటమి భయంతో ఉంది. "

- ప్రియాంక తిబ్రెవాల్​, భాజపా అభ్యర్థి.  

తాత్కాలిక కేంద్రాలు..

భవానీపూర్​లోని 71వ వార్డులో మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా తాత్కాలిక పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.  పోలింగ్​ కేంద్రాల్లోని ఈవీఎంలు, వీవీప్యాట్​ల పనితీరును పరిశీలించారు.

06:13 September 30

Bhabanipur bypoll: భవానీపుర్​ పోలింగ్​కు సర్వం సిద్ధం

బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) బరిలో ఉన్న భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్​కు(Bhabanipur bypoll) సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. తెల్లవారుజామునే పోలింగ్​ కేంద్రాలకు చేరుకుంటున్నారు ఓటర్లు. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకొని 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు చెప్పారు. జాంగీపుర్‌, సంసేర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానాలకు కూడా ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. 

అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి ఓటమి చవిచూసిన మమతా బెనర్జీ.. ఈ ఉపఎన్నికలో భవానీపుర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. దీదీకి పోటీగా భాజపా నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. 

అక్టోబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

Last Updated : Sep 30, 2021, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details