తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​ ఉపఎన్నికల్లో టీఎంసీ క్లీన్​స్వీప్​ - మమతా బెనర్జీ వార్తలు

బంగాల్​ ఉపఎన్నికల్లో(west bengal bypolls 2021) టీఎంసీ హవా కొనసాగింది. మొత్తం నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. భాజపా అభ్యర్థులపై భారీ మెజారిటీ సాధించి చిత్తుగా ఓడించింది(west bengal bypoll results 2021). ఇది విద్వేష రాజకీయాలపై బంగాల్ ప్రజలు సాధించిన విజయమని సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

By-poll results is victory of development over hate politics: Mamata Banerjee
బంగాల్​ ఉపఎన్నికల్లో టీఎంసీ క్లీన్​స్వీప్

By

Published : Nov 2, 2021, 3:17 PM IST

Updated : Nov 2, 2021, 5:21 PM IST

బంగాల్​లో నాలుగు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో(west bengal bypolls 2021) అధికార టీఎంసీ ఘన విజయం సాధించింది. దిన్​హాటా, గోసబలో లక్షకు పైగా ఓట్ల తేడాతో భాజపాను ఓడించింది. ఇది బంగాల్ ప్రజల విజయమని సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. బంగాల్ ప్రజలు అభివృద్ధికే పట్టం గడతారన్నారు. ఈ గెలుపును విద్వేష రాయకీయాలపై తాము సాధించిన విజయంగా అభివర్ణించారు(west bengal bypoll results 2021).

టీఎంసీ ఘన విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

దిన్​హాటా, శాంతిపుర్​, గోసబ, ఖార్​దహ అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్​-మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిన్​హాటాలో భాజపా నేత నిశిత్​ ప్రామాణిక్ గెలుపొందారు. ఆయనకు కేంద్ర సహాయమంత్రిగా తీసుకోవడం వల్ల ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు టీఎంసీ 1.6లక్షల ఓట్లకుపైగా మెజార్టీతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది(west bengal by election 2021 results ).

ఇదీ చదవండి:హిమాచల్​ ఉప ఎన్నికల్లో భాజపాకు కాంగ్రెస్ షాక్!

Last Updated : Nov 2, 2021, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details