తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మేనకోడలిపై బిజినెస్​మ్యాన్​ అత్యాచారం.. దావూద్​ గ్యాంగ్‌తో చంపిస్తానంటూ.. - ముంబయి అత్యాచారం కేసు

Businessman Rape Niece: మేనకోడలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యాపారి. ఈ విషయం ఎవరికైనా చెబితే అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం గ్యాంగ్​తో చంపిస్తానని బెదిరించాడు. ఈ దుర్ఘటన మహారాష్ట్ర, ముంబయిలో వెలుగు చూసింది.

RAPE VICTIM
మేనకోడలిపై వ్యాపారి అత్యాచారం

By

Published : Jun 17, 2022, 7:05 AM IST

Businessman Rape Niece: తన మేన కోడలిపై పలుమార్లు అత్యాచారం చేసిన ఓ బిజినెస్‌మ్యాన్‌.. ఆ విషయం బయటకు చెబితే గ్యాంగ్‌స్టర్లతో చంపిస్తానంటూ ఆమెను బెదిరించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో వెలుగులోకి వచ్చింది. నిందితుడు 2007 నుంచి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, ఇతర క్రిమినల్స్‌తో ఉన్న సంబంధాలతో తనను బెదిరిస్తున్నాడంటూ 35 ఏళ్ల మహిళ అంబోలీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తొలిసారి 2007లో ఓ హోటల్‌లో తనను రేప్‌ చేశాడని బాధితురాలు చెప్పింది. ఆ తర్వాత ముంబయి సబర్బన్‌లోని పలుచోట్ల ఆమెపై అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎక్కడా చెప్పొద్దని బెదిరిస్తుండేవాడు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం తనకు స్నేహితుడని.. మరో కరడుగట్టిన నేరస్థుడు కూడా బంధువని చెబుతూ వారితో చంపిస్తానంటూ బెదిరించినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

అంతేకాకుండా, నిందితుడు తన నుంచి ఒకశాతం వడ్డీపై రూ.2కోట్లు రుణంగా తీసుకున్నాడని, కానీ ఇప్పటివరకు తిరిగి చెల్లించలేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె అంధేరి ప్రాంతంలో నివాసం ఉండటంతో అంబోలీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యాపారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసును తదుపరి దర్యాప్తు కోసం ఎంఐడీసీ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించినట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:దుస్తులు చించేశారని మహిళా ఎంపీ ఆరోపణ.. కేంద్రంపై కాంగ్రెస్​ ఫైర్

సాఫ్ట్​వేర్​ ఉద్యోగం వదిలేసి గాడిదల పెంపకం.. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు!

ABOUT THE AUTHOR

...view details