మహారాష్ట్రలో(maharashtra rains today) భారీ వర్షాల ధాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. యావత్మాల్(yavatmal news today) జిల్లాలో వరద ఉద్ధృతికి ఓ బస్సు నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటన సమయంలో బస్సులో ఆరుగురు ఉండగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరిని సహాయక సిబ్బంది రక్షించారు. డ్రైవర్, కండక్టర్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
బస్సు.. నాందేడ్ నుంచి నాగ్‌పుర్ వెళ్తున్న సమయంలో దహాగోన్ వద్ద ఉన్న బ్రిడ్జి పైనుంచి వరద పోటెత్తుతోంది. నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేకపోయిన డ్రైవర్.. వంతెన దాటేందుకు యత్నించాడు. కానీ వరద వేగానికి బస్సు కొట్టుకుపోయింది. స్థానికుల సహాయంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.