వంద మంది వలస కూలీలతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్ కన్నౌజ్‌లోని ఖదీచా గ్రామానికి సమీపంలో ఉన్న ఆగ్రా-లఖ్‌నవూ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
100 మంది వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా - ఉత్తర్‌ప్రదేశ్‌లో బస్ ప్రమాదం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ వద్ద టైరు పేలి ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో వంద మంది వలస కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది.
![100 మంది వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా labourers bus overturned](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11543452-82-11543452-1619431461654.jpg)
వలసదారుల బస్ బోల్తా-15 మందికి తీవ్రగాయాలు
గాయపడిన వారిని బిల్హౌరీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. రాజస్థాన్ నుంచి బిహార్ వెళ్తున్న ఈ బస్సు టైర్ పేలడం వల్లే.. అదుపు తప్పి బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇదీ చూడండి:పార్కింగ్ స్థలంలోనే కరోనా మృతదేహాల దహనం