తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్టీసీ బస్​ను​ ఎత్తుకెళ్లిన దొంగలు.. వరుడి మెడలోని డబ్బుల దండ చోరీ - వరుడి దండను అపహరించిన ఇద్దరు దుండగులు

ప్రభుత్వ ఆర్టీసీ బస్​ను ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. కేకేఆర్​టీసీకి చెందిన బస్​ను మంగళవారం చోరీ చేశాడు. ఘటనంతా సీసీటీవీలో రికార్డైంది. మరోవైపు, పెళ్లి కొడుకు మెడలో దండను ఎత్తుకెళ్లారు ఓ ఇద్దరు దొంగలు. దిల్లీలో ఈ ఘటన జరిగింది.

bus-theft-at-karnataka-kkrtc-depot
కర్నాటకలో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగలు

By

Published : Feb 21, 2023, 9:14 PM IST

Updated : Feb 21, 2023, 10:54 PM IST

కర్ణాటకలో ఓ ప్రభుత్వ ఆర్టీసీ బస్​ చోరీకి గురైంది. కల్యాణ కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్​ను.. గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. మంగళవారం ఈ ఘటన జరిగింది. ఉదయం 3.30 గంటలకు బస్​స్టాండ్​లోకి వచ్చిన దొంగ అనంతంరం బస్​ ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనంతా సీసీ కెమెరాలో రికార్డైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బస్​ కోసం తీవ్ర గాలింపులు జరిపారు. అనంతరం తెలంగాణలో బస్​ను​ గుర్తించిన పోలీసులు.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలబురిగి జిల్లాలో ఘటన జరిగింది. చించోలి బస్టాం​డ్​లో పార్కింగ్ చేసి ఉన్న బస్​ను..​ దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన బస్​ నంబర్..​ KA-38 F-971. ఈ బస్సు.. బీదర్​ రెండో డిపోకు చెందినదని అధికారులు తెలిపారు. రోజూ చించోలి-బీదర్ మధ్య ఈ బస్సు ప్రయాణికులను చేరవేస్తుంది. కాగా డిపార్ట్​మెంట్​కు చెందిన వారే బస్​ను అపహరించినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలు బస్​ను తెలంగాణలోని తాండూరు మీదుగా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

చోరీకి గురైన బస్సు.. సోమవారం రాత్రి బీదర్​ నుంచి ప్రయాణికులతో చించోలికి వచ్చింది. అనంతరం 9.15 గంటలకు.. అదే బస్​ స్టాండ్​లో​ బస్​ను పార్క్​ చేశాడు డ్రైవర్. తిరిగి ఉదయం వచ్చి చూసేసరికి బస్​ మాయం అయింది. దీంతో కంగుతిన్న డ్రైవర్​.. ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించాడు. ఆర్టీసీ అధికారులు.. చించోలి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపారు. రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి చోరీకి గురైన బస్సును, నిందితుడిని వెతికారు. కర్ణాటక ఆర్టీసీ అధికారులు కూడా రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపులు జరిపారు. అనంతరం తెలంగాణలో బస్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు మాత్రం ఇంకా దొరకలేదన్నారు.

పెళ్లి కొడుకు దండ ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు..
పెళ్లి కొడుకు మెడలో ఉన్న దండను ఎత్తుకెళ్లారు ఇద్దరు దొంగలు. రూ.10వేల విలువైన రూ.500 నోట్లతో ఆ దండను తయారు చేశారు. దీంతో దానిపై కన్నేసిన దొంగలు.. దండను ఎత్తుకెళ్లారు. జనవరి 31న దిల్లీలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగత్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. నిందితులను గీతా కాలనీకి చెందిన జస్మీత్ సింగ్, రాజీవ్​గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు స్విగ్గీలో డెలివరి బాయ్స్​గా పనిచేస్తున్నట్లు తెలిపారు. జనవరి 31న స్థానికంగా ఉన్న ఓ ప్యాలెస్​లో.. అను గుప్తా అనే వ్యక్తి పెళ్లి వేడుక జరుగుతోంది. అదే సమయంలో జస్మీత్ సింగ్, రాజీవ్​లు అక్కడికి వచ్చారు. అనంతరం పెళ్లి కొడుకు మెడలో ఉన్న దండను తీసుకుని.. స్కూటీపై పారిపోయారు. ఘటనపై పెళ్లికొడుకు సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దాదాపు 80 సీసీటీవీ కెమెరాలను పరిశీలించి.. నిందితులను మంగళవారం పట్టుకున్నారు.

Last Updated : Feb 21, 2023, 10:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details