తెలంగాణ

telangana

ఆ ఊరికి రోడ్డు, బస్సు.. 'బిందు' పెళ్లికి లైన్​ క్లియర్!

స్వగ్రామానికి రోడ్డు కోసం ప్రధానమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రికి లేఖ రాసిన (Rampur village road no marriage) యువతి కథ సుఖాంతమైంది. ఆమె గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తైంది. ఆర్​టీసీ బస్సు కూడా గ్రామంలోకి వచ్చింది. ఈ సందర్భంగా బస్సుకు గ్రామస్థులు పూజలు చేశారు.

By

Published : Sep 23, 2021, 7:19 PM IST

Published : Sep 23, 2021, 7:19 PM IST

Updated : Sep 24, 2021, 2:31 AM IST

no marriage till village gets road
రోడ్డు వేస్తేనే పెళ్లి

'బిందు' పెళ్లికి లైన్​ క్లియర్!

గ్రామానికి రోడ్డు వచ్చేంతవరకు పెళ్లి చేసుకోనని ప్రధానికి లేఖ (Letter to PMO india) రాసిన కర్ణాటక యువతి ఆశయం నెరవేరింది. ఆ ఊరికి రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఓ బస్సు కూడా ఆ గ్రామానికి వచ్చింది. (Rampur village road no marriage)

దావనగెరె జిల్లా రాంపుర్ గ్రామానికి చెందిన బిందు(26).. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు లేఖ రాసి వార్తల్లోకెక్కారు. తన గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామానికి రోడ్డు వేసేంత వరకు తాను వివాహం చేసుకోనని చెప్పారు. (Rampur village road no marriage) స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా తమ గ్రామానికి కనీస సదుపాయాలు అందుబాటులోకి రాలేదని 'ఈటీవీ భారత్'​తో యువతి వాపోయారు. అందుకే సీఎం, పీఎంకు లేఖ రాసినట్లు చెప్పారు.

గ్రామానికి వస్తున్న బస్సు
రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు ఇలా..

కదిలిన సర్కారు

ఈ విషయంపై 'ఈటీవీ భారత్' అందించిన కథనానికి అధికార యంత్రాంగం నుంచి స్పందన వచ్చింది. దావనగెరె జిల్లా కలెక్టర్ మహంతేశ్ బిలాగి.. గ్రామాన్ని సందర్శించి, రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. యువతి సమస్యపై సీఎం కార్యాలయం స్పందించి.. తగిన చర్యలకు ఆదేశించింది. (Rampur village road no marriage)

బస్సుకు పూజలు చేస్తున్న మహిళ
రోడ్డు నిర్మాణం జరుగుతున్న సమయంలో యువతి సెల్ఫీ
రోడ్డు వేసే ముందు మట్టిని చదును చేస్తున్న రోలర్

బస్సుకు పూజలు

దీంతో వెంటనే జిల్లా యంత్రాంగం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. సిమెంట్ రోడ్డును పూర్తి చేసింది. రోడ్డు నిర్మాణం పూర్తైన నేపథ్యంలో ఆర్​టీసీ బస్సు గ్రామంలోకి వచ్చింది. ఈ సందర్భంగా బస్సుకు యువతి గ్రామస్థులు పూజలు చేశారు.

ఇదీ చదవండి:పోలీసులు అరెస్టు చేస్తారని తుపాకీతో కాల్చుకున్న నిందితుడు

Last Updated : Sep 24, 2021, 2:31 AM IST

ABOUT THE AUTHOR

...view details