మధ్యప్రదేశ్‌లో మంగళవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో కీలక విషయం బయటకు వచ్చింది. ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు డ్రైవర్ బస్సును చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ మార్గంలో తీసుకెళ్లినట్లు తెలిసింది. 80కిలో మీటర్లు ప్రయాణించిన తర్వాత రాపుర్ సెకిన్ తాలుకా.. పట్నా వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీనితో బస్సు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.
చివరి నిమిషంలో రూటు మార్పే ముప్పైందా! - మధ్య ప్రదేశ్ బస్సు ప్రమాదం అసలు కారణం
మధ్యప్రదేశ్ బస్సు ప్రమాదంపై ఎన్నెన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం సహా.. ట్రాఫిక్ కారణంగా వెరే మార్గంలో బస్సును నడపడం వల్లే ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది.
మధ్య ప్రదేశ్ బస్సు ప్రమాదం
ఈ ఘోర ప్రమాదంలో బస్సులో ఉన్న వారిలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు రాగా.. ఓ కుటుంబం సహాయంతో బయట పడ్డారు. అయితే అందులో ఒకరు ఆస్పత్రితో చికిత్ర పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు.