Bus Accident in Uttarakhand Today : ఉత్తరాఖండ్ గంగోత్రిలో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఆదివారం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో పది మంది పరిస్థితి విషమంగా ఉంది. గంగోత్రి రహదారిపై గన్గ్నానీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 35 మంది భక్తులు ఉన్నట్లు సమాచారం. వీరంతా గుజరాత్‌కు చెందిన వారిగా తెలిసింది.
Uttarakhand Bus Accident :బస్సు గంగోత్రిధామ్ నుంచి ఉత్తరకాశీ వైపు వెళుతుండగా సాయంత్రం 4.15 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ముందుగా ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు.. వెంటనే అక్కడికి చేరుకుని బాధితులను రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు.. సహాయక చర్చలు చేపట్టి గాయపడ్డవారిని కాపాడారు. 27 మంది ప్రయాణికులను రక్షించి.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు.
లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. 9 మంది సైనికులు మృతి..
Army Vehicle Accident Today :శనివారం సాయంత్రం ఇలాంటి ఘటనే జరిగింది. సైనికులతో వెళ్తున్న ఓ ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది సైనికులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతమైన లద్ధాఖ్లోఈ ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఓ జవాన్‌ను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.