Bus accident in Odisha: ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొని బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.
బాలాసోర్ జిల్లాలోని సోరో పోలీస్ స్టేషన్ పరిధి.. బిదుఛక్ వద్ద బస్సును బొగ్గు లోడ్ లారీ ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లిపోయాయి. బస్సు బోల్తా పడింది. బస్సు ఉదాలా నుంచి భువనేశ్వర్ వైపునకు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.