తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎద్దుల బండి లైబ్రరీ'లో పిల్లల ఇంటికే పుస్తకాలు! - Bullock Library in Madhya pradesh

Bullock Cart Library: కరోనా​ కారణంగా పాఠశాలలు మూతపడి చదువుకు దూరమైన విద్యార్థుల కోసం వినూత్న ఆలోచన చేశారు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు. ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కోసం.. ఎద్దుల బండి లైబ్రరీ శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ వెళ్లి పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.

Bullock cart library
Bullock cart library

By

Published : Jan 29, 2022, 5:07 AM IST

'ఎద్దుల బండి లైబ్రరీ'లో పిల్లల ఇంటికే పుస్తకాలు

Bullock cart library: కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లింది. ఈ క్రమంలో పిల్లలు చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో సరికొత్త ఆలోచన చేశారు​ మధ్యప్రదేశ్​ బెతుల్​ జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు కమలా దవండే. 'ఎద్దుల బండి లైబ్రరీ'కి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ వెళ్లి.. పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థుల ఇళ్ల వద్దే 'మొహల్లా పద్ధతి'లో పాఠాలు బోధిస్తున్నారు.

'ఎద్దుల బండి లైబ్రరీ'లో పిల్లలకు పుస్తకాలు పంపిణీ
ఇంటింటికి పుస్తకాలు పంపిణీ చేస్తున్న కమల

సరైన సాంకేతిక సదుపాయాలు లేక.. భౌంసదేహీ ప్రాంతంలో మారుమూల గ్రామానికి చెందిన పిల్లలు ఆన్​లైన్​ తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. దీంతో ఆ గ్రామంలోని పాఠశాలలో పని చేస్తున్న కమల.. వినూత్నంగా ఆలోచించి ఎద్దుల బండిని లైబ్రరీగా మార్చారు. ఆ బండిలో పుస్తకాలు వెసుకుని ఇంటింటికీ వెళ్లి.. విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. తమ ఇంటి ముందుకు లైబ్రరీ వచ్చిందని పిల్లలకు తెలియజేసేలా.. బండి వెనకాల వెళ్లే కొందరు విద్యార్థులు ప్లేట్​పై కర్రతో కొడతాడు. దీంతో విద్యార్థులు ఆ బండి వద్దకు వెళ్లి.. తమకు కావాల్సిన పుస్తకాలు తీసుకుంటారు.

ఉపాధ్యాయురాలు కమలా దవండే
పిల్లలకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలు

"ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు పనులకు వెళ్లే దయనీయ స్థితి ఉండేది. కానీ నేను వెళ్లాక ఆ పరిస్థితి కొంత వరకు మెరుగుపడింది. కొవిడ్​ సమయంలో వారి చదువులకు అంతరాయం కలగకుండా సంచాలిత మొహల్లా క్లాసులు ఏర్పాటు చేశాను. ఎద్దుల బండినే లైబ్రరీగా మార్చి ఇంటింటికీ పుస్తకాలను పంపిణీ చేస్తున్నాను."

- కమలా దవండే ఉపాధ్యాయురాలు

పిల్లలు చదువుకోవాలనే తాపత్రయంతో కమల చేసే గొప్ప ప్రయత్నానాన్ని నెటిజన్లు సహా.. స్థానిక అధికారులు ప్రశంసిస్తున్నారు.

చదువుకుంటున్న పిల్లలు

ఇదీ చూడండి:విద్యార్థుల దగ్గరకే పాఠాలు- బైకు మీద క్లాసులు

ABOUT THE AUTHOR

...view details