తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఫేమస్ కావాలనే 'బుల్లీ బాయ్' యాప్​లో మహిళల వేలం' - బుల్లీ బాయ్​ న్యూస్​

Bulli Bai case: ఎలాగైనా ఫేమస్​ కావాలనే ఉద్దేశంతోనే మహిళల అసభ్య పొటోలతో బుల్లీ బాయ్​ యాప్​ను నీరజ్ బిష్ణోయ్ క్రియేట్​ చేశాడని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎంత మందికి సంబంధాలున్నాయనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. 'సుల్లీ డీల్స్'​ కేసుతోనూ నీరజ్​కు సంబంధాలు ఉండే అవకాశముందని చెప్పారు.​

Bulli Bai case
బుల్లీ బాయ్​ యాప్​ ప్రధాన సూత్రధారి

By

Published : Jan 8, 2022, 11:57 AM IST

Bulli Bai case: బుల్లీ బాయ్ యాప్​ కేసు విచారణకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. దీని ప్రధాన సూత్రధారి అయిన 21 ఏళ్ల బీటెక్ విద్యార్థి నీరజ్​ బిష్ణోయ్​ కేవలం ఫేమస్​ కావాలనే ఉద్దేశంతోనే యాప్​ను రూపొందించినట్లు చెప్పారు. సొంత గుర్తింపు కోసమే ఈ పని చేసినట్లు అతడు అంగీకరించినట్లు వెల్లడించారు. ఇందులో వేరే వాళ్లకు సంబంధముందా అనే విషయంపై ఇప్పటివరకు జరిగిన విచారణలో ఎలాంటి సమాచారం లభించలేదని వివరించారు.

Sulli deals case

అయితే నీరజ్​కు సుల్లీ డీల్స్​ కేసుతోనూ సంబంధాలు ఉండే అవకాశముందని పోలీసులు చెప్పారు. ఈ విషయంపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు. బుల్లీ బాయ్​ నెట్​ వర్క్​ సుల్లీ డీల్స్​కు సంబంధాలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నీరజ్​ ఉపయోగించిన పరికరాలను స్కాన్ చేస్తున్నామని, అతని నుంచి మరిన్ని విషయాలు రాబడుతామని చెప్పారు. ఆ తర్వాత మొత్తం వ్యవహారం బట్టబయలవుతుందన్నారు. ఈ కేసులో ఓ ఆసక్తికర విషయమొకటి తమ దృష్టికి వచ్చిందని అధికారులు చెప్పారు.. సుల్లీ డీల్స్​పై ఓ మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు విచారణ గురించి కూపీ లాగేందుకు నీరజ్..​ మీడియా ప్రతినిధినని చెప్పి సైబర్ సెల్ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని వెల్లడించారు.

"సుల్లీ డీల్స్​ కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో మా బృందాన్ని తప్పుదోవ పట్టించేందుకు నీరజ్​ ప్రయత్నించాడు. వాట్సాప్​ కాల్​ చేసి తాను మీడియా ప్రతినిధినని చెప్పాడు. కేసు విచారణ గురించి కూపీ లాగేందుకు ప్రయత్నించాడు. అతని ఫోన్ రికార్డ్సును పరిశీలిస్తే మాకు ఈ విషయం తెలిసింది. బుల్లీబాయ్​ యాప్ సృష్టించడానికి ముందే ట్విట్టర్​ ఖాతా క్రియేట్​​ చేసి మహిళ ఫొటోను(ఫిర్యాదు చేసిన బాధితురాలు) అప్లోడ్​ చేసి ఆమెను వేలం వేశాడు. సుల్లీ డీల్స్​ కేసు విచారణ జరగుతుండగా ఇలాంటి మరో ట్విట్టర్​ ఖాతా గురించి తెలిసింది."

-పోలీసు అధికారి

Bulli Bai mastermind

బుల్లీ బాయ్​ యాప్​ సూత్రధారి నీరజ్​ను అరెస్టు చేసిన తర్వాత ఓ వర్గానికి చెందిన వందల మంది మహిళల కేసులను పరిష్కరించినట్లు పోలీసులు చెప్పారు. వీరందరి ఫొటోలను మార్ఫ్​ చేసి వాళ్లకు తెలియకుండానే యాప్​లో వేలానికి పెట్టారని తెలిపారు.

Niraj Bishnoi

బుల్లీ బాయ్​ యాప్​తో పాటు గేమింగ్ క్యారెక్టర్​ గియూ పేరుతో ట్విట్టర్​లో చాలా ఖాతాలు క్రియేట్​ చేశాడు నీరజ్​. వాటిలో మహిళల అసభ్య ఫొటోలు పెట్టి వారిని వేలానికి వేస్తున్నట్లు పోస్టులు పెట్టాడు. సుల్లీ డీల్స్​ కేసు విచారణ సమయంలోనూ ఓ అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా సృష్టించి పోలీసులను సంప్రదించేందుకు ప్రయత్నించాడు.

ఇదీ చదవండి:రూ.1000కి ఫేక్​ వ్యాక్సిన్ సర్టిఫికేట్​- నిందితుడు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details