Bulli bai controversy: బుల్లీ బాయ్ యాప్ కేసులో ప్రధాన కుట్రదారు నీరజ్ బిష్ణోయ్‌ను అరెస్ట్ చేసినట్లు దిల్లీ పోలీసులు ప్రకటించారు. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇంతకుముందు బెంగళూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి విశాల్ కుమార్‌ను, ఉత్తరాఖండ్‌లో శ్వేత సింగ్‌ను, మయాంక్ రావల్‌ను అరెస్ట్ చేశారు.
అసోంలోని దిగంబర్ ప్రాంతానికి చెందిన నీరజ్ బిష్ణోయ్‌ను(20) కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు.. గురువారం అరెస్ట్ చేశారు. ఇతడు భోపాల్‌లోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో బీటెక్ విద్యార్ధిగా తెలిపారు.
"దిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఐఎఫ్ఎస్ఓ.. నీరజ్ బిష్ణోయ్‌ని అసోంలో అరెస్ట్ చేసింది. బుల్లి బాయ్ యాప్ కుట్రలో ప్రధాన నిందితుడు నీరజ్. యాప్ ట్విట్టర్ ఖాతా నిర్వహించేది అతనే. దిల్లీకి తరలిస్తున్నాం."