తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడు నెలలుగా ఆ గ్రామంలో 'బుల్లెట్ల' వర్షం.. గాయాలతో ప్రజలు విలవిల! - Villagers injured due to bullets

ఒడిశాలోని ఓ గ్రామంలో బుల్లెట్లు ఒక్కసారిగా మనుషుల మీదకు దూసుకొస్తున్నాయి. దీంతో గ్రామస్థులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. గత మూడేళ్లుగా ఈ ఘటనలు జరుగుతున్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందంటే?

Bullets rain in village
గ్రామంలో తూటాల వర్షం

By

Published : Dec 8, 2022, 9:35 PM IST

Updated : Dec 8, 2022, 10:23 PM IST

మూడు నెలలుగా ఆ గ్రామంలో బుల్లెట్ల వర్షం

ఆ గ్రామ ప్రజలు గత మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనులకు వెళ్తున్నారు. విద్యార్థులు బడికి వెళ్లేందుకు కూడా జంకుతున్నారు. వీటన్నింటికీ కారణం ఏంటంటే ఆ ఊర్లోకి అప్పుడప్పుడు బుల్లెట్లు వచ్చి పడుతున్నాయి. అవి నేరుగా మనుషులపైకి దూసుకొస్తున్నాయి.

ఒడిశాలోని కటక్ జిల్లా నువాఘమ్ గ్రామంలో అప్పుడప్పుడు తూటాల వర్షం కురుస్తోంది. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మనుషుల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. అసలు బుల్లెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తమకు తెలియదని చెబుతున్నారు. దీనికి పరిష్కారం కనుగొనాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు.

2019లో సుభాషిని రౌత్​ అనే మహిళ మంచి నీళ్ల కోసం బయటకు వెళ్లిన సమయంలో ఇంటి వెనుక నుంచి ఒక బుల్లెట్​ వచ్చి నేరుగా ఆమె చేతిలోకి దూసుకెళ్లింది. అనంతరం సర్జరీ చేసి, బుల్లెట్​ను తొలగించారు వైద్యులు. ఇలాంటి ఘటనలు ఆ ఊర్లో ఎన్నో జరిగాయి. చాలా మంది చేతులు, కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి.
ఈ ఘటనలపై తమకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా కలెక్టర్​ చెబుతున్నారు. ఈ అంశంపై విచారణ చేయాల్సిందిగా జిల్లా ఎస్​పీకి ఆదేశించినట్లు పేర్కొన్నారు. బుల్లెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న విషయం విచారణ తరువాతే తెలుస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

Last Updated : Dec 8, 2022, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details