UP Election Buldozer: రాష్ట్రంలోని అన్ని బుల్డోజర్లను రిపేర్ కోసం పంపించామని అన్నారు ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. మెయిన్పురీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నేరస్థుల అక్రమాస్తులను కూల్చివేసేందుకు యూపీ ప్రభుత్వం గతంలో బుల్డోజర్లను ఉపయోగించింది. ఈ సందర్భంగానే 'ఎన్నికల సమయంలోనూ బుల్డోజర్లను ఉపయోగిస్తారా?' అన్న సమాజ్వాదీ పార్టీ నేతకు ఇలా బదులిచ్చారు యోగి.
'''ఎన్నికల సమయంలోనూ బుల్డోజర్లను ఉపయోగిస్తారా?' అని ఎస్పీ సీనియర్ నేత ఒకరు అడిగారు. కొన్నిసార్లు బుల్డోజర్లకు కూడా విశ్రాంతి అవసరం. కాబట్టి చింతించవద్దని ఆయనకు చెప్పాను. అందుకే ఎన్నికల సమయంలో.. బుల్డోజర్లను మరమ్మతుల కోసం పంపించాం.''
- యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి
Yogi Adityanath: గత నాలుగున్నరేళ్లుగా దాక్కొని, ఎన్నికల ప్రకటన వెలువడగానే కొందరు బయటకు వస్తున్నారని.. వారిని గుర్తించి మార్చి 10 తర్వాత బుల్డోజర్లను ఉపయోగిస్తామని అన్నారు యూపీ సీఎం.
నేరస్థుల మనసులు, ఆలోచనల్లో భయం ఉంటే తప్ప.. వ్యవస్థ సక్రమంగా నడవదని అభిప్రాయపడ్డారు యోగి ఆదిత్యనాథ్. నేరస్థులు తప్పుచేయాలని ఆలోచిస్తే.. మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారికి ఇప్పటికే అర్థమై ఉంటుందని పేర్కొన్నారు.