Building collapse: మహారాష్ట్ర పుణెలో ఓ మాల్ నిర్మాణ పనులు జరుగుతుండగా భారీ ఇనుప నిర్మాణం కూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి - కూలిన భవనం
Building collapse: మహారాష్ట్రలో ఓ మాల్ నిర్మాణ పనులు జరుగుతుండగా భారీ ఇనుప నిర్మాణం కూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Building collapse
ఈ ప్రమాదం యరవాడ ప్రాంతంలోని శాస్త్రినగర్‌లో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కూలీలందరూ బిహార్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. సమర్థమైన రక్షలు లేనందునే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పుణె డీసీపీ రోహిదాస్ పవార్ తెలిపారు.
Last Updated : Feb 4, 2022, 5:48 AM IST